- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నకిలీ విత్తనాలు విక్రయిస్తే సమాచారం ఇవ్వండి
దిశ, వెబ్‌డెస్క్ : వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నకిలీ విత్తనాల విక్రయదారుల ముఠా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే కోట్ల రూపాయల విలువైన నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పోలీస్, వ్యవసాయ అధికారులు అప్రమత్తం అయ్యారు.
రామన్నపేట సీఐ రాజు, వలిగొండ ఎస్ఐ రాఘవేందర్ గౌడ్, వ్యవసాయ అధికారి అంజనిదేవి మండల పరిధిలోని ఎరువులు, ఫెర్టిలైజర్, ఫెస్టిసైడ్ దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. షాపుల్లో రసీదు పుస్తకాలు, నిల్వలు, బిల్లులను పరిశీలించారు. విత్తనాలు విక్రయించే ఏజెంట్ల ఇళ్లలోనూ సోదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడారు.
దేశానికి అన్నం పెట్టే రైతును మోసం చేయవద్దని వ్యాపారులను కోరారు. అన్నదాతలకు పోలీసులు అండగా నిలుస్తారని భరోసా ఇచ్చారు. మండలంలో ఎవరైన నకిలీ విత్తనాలు అమ్మినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు లైసెన్స్ రద్దు చేసి షాప్ సీజ్ చేస్తామని హెచ్చరించారు. మండలంలో నిత్యం అందుబాటులో ఉంటామని, ఎవరిమీదనైన అనుమానం వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ మండల ప్రజలను కోరారు. విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు తప్పని సరిగా బిల్లులు తీసుకోవాలని సూచించారు.