బెజవాడలో నకిలీ పోలీసులు

by srinivas |   ( Updated:2020-10-30 06:15:06.0  )
బెజవాడలో నకిలీ పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: గంజాయి సేవిస్తున్న విద్యార్థులను టార్గెట్ చేసుకున్న పలువురు వ్యక్తులు నకిలీ పోలీసుల అవతారం ఎత్తారు. స్టూడెంట్స్ గంజాయి సేవిస్తున్న సమయంలో పట్టుకొని వారి నుంచి భారీగా డబ్బులు వసూళ్లు చేశారు. ఈ నేపథ్యంలోనే బెంగళూరు బీబీఏ స్టూడెంట్ యోగేంద్రకు ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేశారు. విషయం బయటకు రాకుండా ఉండేందుకు రూ. 3 లక్షల వరకు డిమాండ్ చేసి.. చివరకు రూ. 50 వేలకు ఒప్పుకున్నారు. ఇది తెలుసుకున్న పోలీసులు నిందితులు ప్రదీప్, లతీఫ్ సహా మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ నిందితుల్లో ఒకరు ఏఆర్‌ ఎస్సై కుమారుడు, మరొకరు విజయవాడ దుర్గగుడి పాలకమండలిలో కీలక వ్యక్తి సోదరుడి కుమారుడిగా గుర్తించారు.

Advertisement

Next Story