వీళ్లపనే బాగుంది.. పోలీసు పేరుచెప్పి ఏం చేశారంటే?

by Anukaran |   ( Updated:2021-11-04 05:27:16.0  )
వీళ్లపనే బాగుంది.. పోలీసు పేరుచెప్పి ఏం చేశారంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : పోలీసుల పేర్లు చెప్పి వాహన దారుల నుంచి భారీగా డబ్బు వసూలు చేసిన నకిలీ పోలీసులను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. రహదారుల పై వచ్చి పోయే వాహనాలను ఆపుతూ, సరైన పత్రాలు లేవని, ఫైన్ల పేరుతో వసూళ్లకు పాల్పడ్డారు. అనుమానం వచ్చిన కొంతమంది దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించగా అసలు విషయం బయట పడింది. దాంతో ఇద్దరు నకిలీ పోలీసులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

ఇక తమదైన స్టైల్ లో కోటింగ్ ఇచ్చే సరికి వివరాలు బయటకు వచ్చాయి. వారిలో ఒకరు అనంతపురానికి చెందిన గణేష్, మరోకరు తిరుపతికి చెందిన ప్రసన్న లు గా గుర్తించారు. వారి నుంచి 35 వేల నగదు, 61 గ్రాముల బంగారం, ఒక బైక్, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story