నకిలీ ఫేక్‌బుక్ అకౌంట్స్ ముఠా అరెస్ట్..!

by Sumithra |
నకిలీ ఫేక్‌బుక్ అకౌంట్స్ ముఠా అరెస్ట్..!
X

దిశ, వెబ్‎డెస్క్: పోలీసు అధికారుల పేరుతో నకిలీ ఫేస్‎బుక్ అకౌంట్లతో మోసాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల అంతర్‎రాష్ట్ర ముఠాను నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. లక్ష నగదు, 8 సెల్‎ఫోన్లు, ల్యాప్‎టాప్‎లు స్వాధీనం చేసుకున్నట్లు డీఐజీ, ఇంచార్జ్ ఎస్పీ రంగనాథ్ వెల్లడించారు.

దేశవ్యాప్తంగా 350 మంది పోలీసు అధికారుల పేరుతో నకిలీ అకౌంట్స్ క్రియేట్ చేసినట్లు గుర్తించారు. రాజస్థాన్ కేంద్రంగా ఫేస్‎బుక్ నకిలీ అకౌంట్లతో దందా నడిపిస్తున్నట్లు సమాచారం. పోలీసుల పేరుతో నకిలీ ఖాతాలు, డబ్బులు పంపాలని రిక్వెస్ట్‎లు పంపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed