మంత్రి తమ్ముడి పేరిట నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్

by Aamani |
Fake Facebook
X

దిశ, నిజామాబాద్ ప్రతినిధి : సైబర్ నేరగాళ్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోదరుడు వేముల శ్రీనివాస్ అలియాస్ అజయ్ రెడ్డి ఫేస్‌బుక్‌ను హ్యాక్ చేశారు. వెటర్నరీ వైద్యుడైన శ్రీనివాస్ పేరిట ఫేస్ బుక్ అకౌంట్ క్రియోట్ చేసి డబ్బులు వసూళ్లకు తెరలేపారు. బుధవారం సాయంత్రం నుంచి బాల్కొండ నియోజకవర్గంలో వేముల శ్రీనివాస్ అకౌంట్‌లో ఉన్నవారికి డబ్బులు అవసరం ఉన్నాయని, వెంటనే పంపాలని రిక్వెస్ట్‌లు పంపడంతో ఈ వ్యవహారం బయటపడింది.

వెంటనే అప్రమత్తమైన మంత్రి అనుచరులు, పార్టీ నాయకులు ఎవరు డబ్బులు పంపవద్దని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. ఫేస్‌బుక్‌ను హ్యాక్ చేశారని, ఎవరు సైబర్ నేరగాళ్లు ఇచ్చిన నంబర్లకు డబ్బులు పంపద్దని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story