సినిమాల్లో చాన్స్ ఇస్తానని చెప్పిన అసిస్టెంట్ డైరెక్టర్.. తీరా వెళ్లేసరికి

by srinivas |
Praveen Kumar
X

దిశ, ఏపీ బ్యూరో: సినిమా అవకాశాల పేరుతో అమ్మాయిలకు వల వేస్తున్న ఓ కీచకుడి బాగోతం గుట్టురట్టైంది. కొత్త సినిమాలో అవకాశాలు ఇస్తానంటూ యువతులను నమ్మించి లైంగిక దాడులకు పాల్పడుతున్న కామాంధుడిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే ప్రవీణ్‌ కుమార్‌ అనే వ్యక్తి తాను చెన్నైలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌నని ప్రస్తుతం షార్ట్‌ ఫిల్మ్స్‌ తీయబోతున్నట్లు ప్రచారం చేశాడు. తన షార్ట్ ఫిల్మ్స్‌లో నటించేందుకు నటీమణులు కావాలని ప్రచారం చేశాడు. ఇందులో భాగంగా సూళ్లూరుపేటలో శ్రీ చెంగాలమ్మ మహత్యం మూవీ క్రియేషన్స్ పేరిట కార్యాలయాన్ని కూడా ప్రారంభించాడు. సినిమాల్లో నటించాలనే ఆశతో కొందరు యువతులు ప్రవీణ్‌కుమార్‌ను ఆశ్రయించారు.

దీంతో వారి ఆశను ఆసరాగా చేసుకుని వారిపై లైంగిక దాడికి పాల్పడేవాడు. అయితే ఇటీవలే ఓ యువతిని వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో ఆ యువతి అతడి వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో కుటుంబ సభ్యులు ఆరా తియ్యగా అసలుు విషయం చెప్పి బోరున విలపించింది. దీంతో బాధిత యువతి కుటుంబ సభ్యులతో కలిసి సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ప్రవీణ్, చిత్ర యూనిట్ సభ్యులు పరారయ్యారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed