87శాతం తగ్గిన ప్యాసింజర్ వాహనాల విక్రయాలు!

by Harish |
87శాతం తగ్గిన ప్యాసింజర్ వాహనాల విక్రయాలు!
X

ముంబయి: కరోనా వ్యాప్తితోపాటు, లాక్‌డౌన్ కారణంగా మే నెలలో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు భారీగా దిగజారాయి. మొత్తం 30,749 యూనిట్ల విక్రయాలతో గతేడాది కంటే 86.97శాతం పడిపోయాయని ఆటోమొబైల్స్ డీలర్స్ బాడీ(ఎఫ్ఏడీఏ) వెల్లడించింది. ఈ మేరకు 1225 ఆర్టీవో కార్యాలయాల నుంచి డేటాను సేకరించారు. గతేడాది ద్విచక్ర వాహనాలు 14,19,842 యూనిట్ల విక్రయాలు జరగ్గా, ఈ ఏడాది మేలో 88.8 శాతం క్షీణించి 1,59,039 యూనిట్లకు పరిమితమయ్యాయి. గతేడాది 80,392 కమర్షియల్ వాహనాలు యూనిట్లు విక్రయించగా, ఈసారి 2,711 యూనిట్ల అమ్మకాలతో 96.63 శాతం తగ్గాయి. మొత్తం వాహన విక్రయాలు గతేడాది కంటే 88.87శాతం తగ్గి 2,02,697 యూనిట్లుగా నమోదయ్యాయి. మే నెల చివరికి 26,500 ఔట్‌లెట్లలో 80, వర్క్‌షాప్ కార్యకలాపాలు 80శాతం జరిగాయని ఎఫ్ఏడీఏ అధ్యక్షుడు ఆశిశ్ కాలె చెప్పారు. జూన్ నెలకు కార్యకలాపాలు మళ్లీ మొదలైనప్పటికీ తొలి 10 రోజుల్లో డిమాండ్ లేదన్నారు. కరోనా నుంచి జాగ్రత్తలు పాటించాల్సి ఉండటం వల్ల అమ్మకాలు తగ్గాయని, ప్రధానంగా పట్టణాల్లో మరింత బలహీనమైనట్టు చెప్పారు. ఇదే సందర్భంలో వాహన అమ్మకాల విక్రయాలపై మార్జిన్ పెంచాలని డీలర్ల సంఘాలు కోరుతున్నట్టు ఆశిశ్ గుర్తుచేశారు. గిరాకీ బలహీనత ఇలాగే కొనసాగితే లక్షల్లో ఉద్యోగాలకు ప్రమాదం తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. అలా జరిగితే డీలర్ల మనుగడ ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు.

Advertisement

Next Story

Most Viewed