- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక ఫేస్‌బుక్‌లోనూ షాపింగ్
దిశ, వెబ్‌డెస్క్:
ఫేస్‌బుక్ తన యూజర్లను మరింతగా ఆకట్టుకునేందుకు కొత్త కొత్త అప్‌డేట్లను తీసుకొస్తోంది. ఇప్పటికే వీడియో కాలింగ్‌ను మరింత సులభతరం చేయడం కోసం మెసెంజర్ రూమ్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ మెసెంజర్ రూమ్స్ ద్వారా వినియోగదారులు 50 మందితో ఒకేసారి వీడియో కాల్ మాట్లాడుకునే అవకాశం కల్పించింది. కళ్లకు హాని కలగకుండా ఉండేందుకు మెసెంజర్‌లో డార్క్ మోడ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన ఫేస్‌బుక్.. తాజాగా తన యూజర్లకు మరో న్యూ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. త్వరలోనే వినియోగదారులకు ఆన్‌లైన్ షాపింగ్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది.
వరల్డ్స్ లార్జెస్ట్ సోషల్ నెట్‌వర్క్ ప్లాట్‌ఫామ్ అయిన ఫేస్‌బుక్.. ఈ కామర్స్‌లోకి అడుగుపెట్టింది. దీంతో స్థానికంగా ఉండే షాపుల యజమానులు ఇకపై తమ వస్తువులను ఫేస్‌బుక్ షాపింగ్ ఫీచర్‌లో పెట్టుకోవచ్చు. రిటెయిలర్స్ వారి వారి ప్రొడక్ట్ కేటాలాగ్స్‌ను ఫేస్‌బుక్ పేజీలో డిస్‌ప్లే చేసుకోవచ్చు. రిటెయిలర్స్ పేజీలోకి డైరెక్ట్‌గా వెళ్లడం ద్వారా గానీ, వారి యాడ్‌పై క్లిక్ చేయడం ద్వారా గానీ యూజర్లు ఆయా షాపుల్లో షాపింగ్ చేస్తూ తమకు కావాల్సిన వస్తువులను కొనుక్కోవచ్చు. స్థానిక వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు ఈ ఫీచర్ ఉంయోగపడుతుందని ఫేస్‌బుక్ ప్రకటించింది.