బాయ్స్ లాకర్ రూమ్ గురించి స్పందించిన ఫేస్‌బుక్

by Shamantha N |
బాయ్స్ లాకర్ రూమ్ గురించి స్పందించిన ఫేస్‌బుక్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫేస్‌బుక్, ట్విట్టర్లలో రెండు రోజులుగా వైరల్ అవుతున్న బాయ్స్ లాకర్ రూమ్ వివాదం గురించి ఇన్‌స్టాగ్రాం పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్ స్పందించింది. లైంగిక హింసను ఏ రూపంలోనైనా తాము ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోయేది లేదని తెలిపింది. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లల విషయంలో గట్టి చర్యలు తీసుకునేందుకు సిద్ధమని వెల్లడించింది. కమ్యూనిటీ ప్రమాణాలకు లోబడే తాము చర్య తీసుకుంటామని పేర్కొంది.

బాయ్స్ లాకర్ రూమ్ వివాదం
బాయ్స్ లాకర్ రూమ్ అనేది ఒక ఇన్‌స్టాగ్రాం గ్రూప్ పేరు. ఇందులో ఢిల్లీ స్కూల్ విద్యార్థులు సభ్యులు. వీళ్లందరూ 11, 12 తరగతులకు చెందినవారే. మహా అయితే సరాసరి వయస్సు 17 సంవత్సరాలు ఉంటుందేమో. అయితే ఈ గ్రూప్‌లో వీరు చేసే పనులు మాత్రం 18 ప్లస్సే. వాళ్ల క్లాస్ అమ్మాయిల ఫొటోలు షేర్ చేసుకుని వారి గురించి తప్పుడు మాటలతో చర్చించుకునేవారు. అంతేకాకుండా నగ్నఫొటోలను కూడా షేర్ చేసుకునేవారు. ఆ చర్చలకు సంబంధించిన స్క్రీన్ షాట్లు, ఆ గ్రూప్ సభ్యుల పేర్లు బయటపడ్డాయి. ఇప్పుడు అవే వైరల్ అవుతున్నాయి. ఈ తప్పుడు పని గురించి మానవ హక్కులు, మహిళా హక్కుల కమిషన్లు ఫేస్‌బుక్‌కి నోటీసులు పంపించాయి. సైబర్ సెక్యూరిటీ నేరం కింద గ్రూప్ సభ్యులను అరెస్టు చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Tags: boys locker room, bois locker room, delhi, nudity, child nudity, human rights, facebook, instagram

Advertisement

Next Story

Most Viewed