- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక నుంచి ఫేస్‌బుక్‌కు కొత్త పేరు.. ఏంటో తెలుసా.?
దిశ, వెబ్‌డెస్క్ : గత రెండు మూడు రోజుల నుంచి ఫేస్బుక్ పేరు మారబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ పేరు మార్పుపై సంస్థ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ క్లారిటీ ఇచ్చారు. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ పేరును మెటాగా నామకరణం చేయనున్నట్టు జుకర్ బర్గ్ గురువారం ఓ ఈవెంట్లో తెలిపారు.ఫేస్‌బుక్‌కు చెందిన అన్ని కంపెనీలకు మాతృ సంస్థగా మెటా వర్క్ చేయనుందని పేర్కొన్నారు. అంతే కాకుండా ఫేస్బుక్ కింద కొనసాగిన సామాజిక మాధ్యమాలైన ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లు ఇకపై ‘మెటా’ కింద కొనసాగుతాయని తెలిపారు. అంటే మాతృ సంస్థ పేరుమాత్రమే మారింది తప్ప, దాని అనుసంధాన సామాజిక మాధ్యమాల సేవలు పాత పేర్లతోనే కొనసాగుతాయని క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా జుకర్ బర్గ్ మాట్లాడుతూ.. రెండు నెలలు శ్రమించి కంపెనీ పేరు ‘మెటా’గా మార్చారని తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో ఇది చాలా ప్రభావంతంగా పనిచేయబోతుందని ధీమా వ్యక్తం చేశారు. దీనిని ‘మెటా వర్స్’లో భాగంగా పేరు మార్పు జరిగిందని చెప్పారు. అంతే కాకుండా యాప్‌లో నుండి మరింత సాంకేతిక పరిపక్వత కలిగిన మెటావర్స్ దిశగా అడుగులు వేస్తుందని మార్క్ జుకర్ బర్గ్ స్పష్టం చేశారు.
డిజిటల్ రియాల్టీ అయిన మెటావర్స్కు చిన్నపేరే మెటా. పేరు మార్పు వెనుక ఫేస్బుక్ భారీ ఫ్యూచర్ ప్లాన్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఐదేళ్లలో యూరప్ మార్కెట్‌ను శాసించాలని టార్గెట్ పెట్టుకుంది. దీంతో పాటు సాధ్యమైనంత త్వరగా మెటావర్స్‌ను బిల్డ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మెటావర్స్‌లోనే ఆగ్మెంటెడ్ రియాల్టీ, వర్చువల్ రియాల్టీ, ఆన్లైన్ గేమింగ్ ఉండనున్నాయి. వీటి మీదనే కంపెనీ భవిష్యత్ ఆధారపడి ఉందని ఫేస్బుక్ చెబుతోంది.