డార్క్ మోడ్, నావిగేషన్ లతో ఫేస్ బుక్ రీడిజైన్

by vinod kumar |
డార్క్ మోడ్, నావిగేషన్ లతో ఫేస్ బుక్ రీడిజైన్
X

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియా దిగ్గజం ‘ఫేస్ బుక్’ మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వినియోగదారుల అవసరానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు ఫేస్ బుక్ తన ఫీచర్స్ ను అప్ డేట్ చేస్తూ వస్తోంది. కొన్ని నెలల టెస్టింగ్ అనంతరం ‘ఫేస్ బుక్ రీడిజైన్’ అధికారికంగా అందరికీ అందుబాటులోకి వచ్చింది. మార్చిలోనే డెస్క్ టాప్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన ‘డార్క్ మోడ్’పై పలు రివ్యూలు, ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాత వాటి ఆధారంగా మార్పులు చేసి.. అధికారికంగా సోమవారం (మే 11) న విడుదల చేశారు.

ఓ పాపులర్ వెబ్ సైట్ ను రీడిజైన్ చేయడం చాలా కష్టం. పాత దాని కన్నా అది ఎంత బెటర్ గా ఉన్న.. నెటిజన్లు కొత్త డిజైన్ ను యాక్సెప్ట్ చేయడానికి టైమ్ పడుతుంది. ఈ కొత్త రీడిజైన్ కారణంగా ఫేస్ బుక్ ఇంతకు ముందు కన్నా ఎక్కువ వేగంగా ఓపెన్ అవుతోంది. వాడటానికి కూడా చాలా సింపుల్ గా , ఈజీగా ఉంటుంది. కళ్లకు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కళ్లు స్ట్రెయిన్ కాకుండా ఉండేలా దీన్ని డిజైన్ చేశారు. ఫేస్ బుక్ సొంతమైన వాట్సాప్ లో కూడా మార్చిలో డార్క్ మోడ్, ఫింగర్ ప్రింట్ అన్ లాక్ వంటి ఫీచర్లు ఫేస్ బుక్ తీసుకు వచ్చింది. ఫేస్ మార్చి నెలలోనే ఫేస్ బుక్ మెసెంజర్ లోనూ డార్క్ మోడ్ ఫీచర్ ను తీసుకు వచ్చింది. కరోనా కాలంలో.. ఫేస్ బుక్ కు ప్రతి నెలా మూడు బిలియన్ల యూజర్లు వచ్చారు. అలాగే పైన ఉండే వాచ్, మార్కెట్ ప్లేస్, గ్రూప్ ట్యాబ్స్ లకు అదనంగా గేమింగ్ ట్యాబ్ ను ఫేస్ బుక్ జత చేసింది. ఫేస్ బుక్ అప్ డేట్ చేసిన న్యూ డిజైన్ తో యూజర్లు వెబ్ సైట్ ను తమకు కన్వీనియెంట్ గా నావిగేట్ చేసుకోవచ్చు.

ఎలా ఎనేబుల్ చేసుకోవాలి :

పైన టాప్ రైట్ లో సెట్టింగ్స్ డ్రాప్ డౌన్ మెనూ లో .. డార్క్ మోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కావాలనుకుంటే ఆన్ చేసుకుంటే సరిపోతుంది. దీని వల్ల స్కేర్ గ్లేర్ తగ్గుతుంది. బ్రైట్ నెస్ తగ్గుతుంది, కాంట్రాస్ట్ కూడా తగ్గుతుంది.

Advertisement

Next Story

Most Viewed