- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎఫ్3.. వెంకీమామ రియాక్షన్ ఇదీ!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలయికలో వచ్చిన చిత్రం ఎఫ్ 2. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్‌తో బాక్సాఫీస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఎఫ్2 సక్సెస్‌తో దానికి సీక్వెల్ అనౌన్స్ చేసిన అనిల్ లాక్‌డౌన్ పీరియడ్‌లో ఎఫ్3 స్టోరీ కూడా సిద్ధం చేశాడట. షూటింగ్స్ మొదలవ్వగానే.. ఈ సినిమా పట్టాలెక్కిద్దామనే జోష్‌లో ఉన్నాడట. కానీ, అనిల్ జోష్‌కు బ్రేక్ లేశాడంట వెంకీ. ‘కరోనా ఎఫెక్ట్ తగ్గాక మెల్లిగా షూటింగ్ మొదలెట్టొచ్చు.. ఇప్పుడంత తొందరేముందిలే’ అని చెప్పాడట.
లాక్‌డౌన్ సడలింపులిచ్చారని.. నిర్లక్ష్యంగా ఉండరాదని అభిమానులను హెచ్చరిస్తూ వెంకీ మామ ట్వీట్ కూడా చేశాడు. అలా చేస్తే దేశం పెద్ద ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ‘లాక్‌డౌన్ ముగిసింది తప్ప.. వైరస్ విజృంభణ తగ్గలేదు. లాక్‌డౌన్‌లో ఎంత జాగ్రత్తగా ఉన్నామో.. ఇప్పుడూ అంతే జాగ్రత్తగా వ్యవహరించాలని’ సూచించారు.