‘F2’కు అరుదైన పురస్కారం..

by Shyam |
‘F2’కు అరుదైన పురస్కారం..
X

దిశ, వెబ్‌డెస్క్ :
‘F2’ సినిమా అరుదైన అవార్డు అందుకుంది. 2019 సంక్రాంతి కానుకగా ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ చిత్రం.. ప్రేక్షకులకు ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వడంలో సక్సెస్ అయింది. కాగా, ఈ సినిమా కేంద్ర సమాచార శాఖ ప్రకటించిన ‘ఇండియన్ పనోరమ’ అవార్డు అందుకుంది. పలు భాషల్లో 26 సినిమాలకు ఈ అవార్డు దక్కగా.. టాలీవుడ్ నుంచి ‘F2’ ఈ ఘనత సొంతం చేసుకుంది.

ఈ విషయాన్ని సినిమా నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ అభిమానులతో షేర్ చేయగా.. బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ నుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ‘F2’ ప్రయాణం చూస్తుంటే గర్వంగా ఉందన్నారు దర్శకులు అనిల్ రావిపూడి. సినిమాతో పాటుగా వ్యక్తిగత అవార్డు కూడా అందుకున్నట్లు చెప్పిన అనిల్.. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌తో పాటు ఇందుకు కారణమైన నటీనటులు, టెక్నిషియన్స్‌కు థాంక్స్ చెప్పాడు. నవ్వుల అల్లరిని తెరమీదకు తెచ్చేందుకు సపోర్ట్ చేసిన నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా.. దాదాపు రూ. 120 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

https://twitter.com/AnilRavipudi/status/1318826256129953796?s=09

Advertisement

Next Story

Most Viewed