కూకట్‌పల్లి‌లో ఘోర అగ్ని ప్రమాదం..

by Sumithra |   ( Updated:2021-07-10 05:49:31.0  )
Fire Accident in kukatpally
X

దిశ, వెబ్‌డెస్క్ : కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కెమికల్ కంపెనీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. అయితే కెమికల్ డ్రమ్ములు పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed