- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో మరోసారి నైట్ కర్ఫ్యూ పొడగింపు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మరోసారి నైట్ కర్ఫ్యూను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండోసారి అమలులో ఉన్న కర్ఫ్యూ గడువు మే 8వ తేదితో ముగియనుండడంతో తాజాగా సీఎస్ సోమేశ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మే 8 నుంచి 15 వరకు(వారం రోజుల పాటు) నైట్ కర్ఫ్యూను పొడగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కరోనా కేసులు ఇతర రాష్ట్రాల్లో కంటే తక్కువగానే నమోదవుతున్నాయని భావించిన ప్రభుత్వం లాక్‌డౌన్ ఆలోచన లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో హైకోర్టు నైట్ కర్ఫ్యూతో ప్రయోజనం ఏంటని.. వీకెండ్ లాక్‌డౌన్‌ను కూడా పరిశీలించాలని ఆదేశించినప్పటికీ.. ప్రభుత్వం మాత్రం నైట్ కర్ఫ్యూను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక కరోనా నివారణ చర్యల్లో భాగంగా.. పెళ్లిలు, శుభకార్యాల్లో అతిథులు 100 మంది, అంత్యక్రియల్లో 20 మందికి మించరాదని స్పష్టం చేసింది. అలాగే, ప్రదర్శనలు, రాజకీయ ర్యాలీలపై నిషేధం విధించింది. మత, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలకు అనుమతి ఉండదని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది.