- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీసీ రిజర్వేషన్లు పదేండ్ల పొడగింపు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లను పదేండ్ల పాటు పొడగించడంతో పాటు ఉద్యోగాల్లో ఐదేండ్ల వయసు మినహాయింపును పొడగిస్తున్నట్టు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2011లో ఉమ్మడి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు ఈ నెల 31తో గడువు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో బీసీల రిజర్వేషన్లు, వయసు మినహాయింపును పొడగిస్తూ బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు కేటగిరీల వారీగా రానున్న పదేండ్లకు రిజర్వేషన్లు వర్తించనున్నాయి. 2021 జూన్ 1 నుంచి 2031 మే 31 వరకూ ఈ రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. దీంతో పాటు ఉద్యోగ నియామకాల సమయంలో బీసీలకు ఐదేండ్ల వయసు మినహాయింపు కూడా వర్తించనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రకారం బీసీ –ఏ కేటగిరీకి 7%, బీసీ–బీకి 10%, బీసీ–సీ కేటగిరీకి ఒక శాతం, బీసీ–డీ 7%, బీసీ–ఈ కేటగిరీలకు 4 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి.