- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూన్‌లో దిగుమతులు 48 శాతం తగ్గాయి!
దిశ, వెబ్‌డెస్క్: పెట్రోలియం, టెక్స్‌టైల్స్, ఇంజనీరింగ్ వస్తువులు, రత్నాలు, ఆభరణాల వస్తువుల ఎగుమతులు తగ్గిపోవడంతో జూన్ నెలలో భారత ఎగుమతులు 12.41 శాతం తగ్గి రూ. 1.64 లక్షల కోట్లకు చేరుకున్నాయి. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దిగుమతులు జూన్‌లో 47.59 శాతం పడిపోయి రూ. 1.58 లక్షల కోట్లకు చేరుకున్నాయి. బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గతేడాది ఇదే నెలలో 1.14 లక్షల కోట్ల లోటుతో పోలిస్తే 59 వేల కోట్ల్ వాణిజ్య మిగులు నమోదైంది. ఏప్రిల్-జూన్ మధ్య ఎగుమతులు 36.71 శాతం తగ్గి రూ. 3.84 లక్షల కోట్లకు చేరుకోగా, దిగుమతులు 52.43 శాతం తగ్గి రూ. 4.53 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు నెలల్లో వాణిజ్య లోటు రూ. 68.4 వేల కోట్లు. చమురు దిగుమతులు జూన్‌లో 55.29 శాతం తగ్గి రూ. 36.9 వేల కోట్లకు చేరుకున్నాయి. అలాగే, బంగారం దిగుమతి 77.42 శాతం తగ్గి రూ. 4,565 కోట్లకు చేరుకున్నాయి.