- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డబ్బున్న అమ్మాయిలు జులాయిల్నే ఎందుకు ప్రేమిస్తారు?
దిశ,వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో మీరుండే ఖరీదైన జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ ఏరియాలో ఓ అమ్మాయి ఉంది. ఆ ఆమ్మాయికి కోట్లలో ఆస్తి. ఆమె కాలు కిందపెడితే ఎక్కడ కందిపోతుందోనని జాగ్రత్తగా చూసుకునే తల్లిదండ్రులు. బయటకు వెళ్లాలంటే ఖరీదైన కార్లు. బంగ్లాలు. షికార్లు చేసేందుకు ఇబ్బడి ముబ్బడిగా వచ్చిపడే డబ్బు. కానీ అదే అమ్మాయి పెళ్లి వయస్సు వచ్చే సరికి ఇంట్లో పనిచేసే కార్ డ్రైవర్‌తోనో లేదంటే అదే ఏరియాలో ఉండే ఆటో డ్రైవర్‌నో, జులాయినో ఇష్టపడుతుంది. ఇంట్లో వాళ్లు కాదంటే పెద్దల్ని ఎదిరిస్తుంది. పెళ్లి చేసుకోనునేందుకు సిద్ధపడుతుంది. కానీ ఆ అమ్మాయి ఇలా ఎందుకు చేస్తుందో అర్ధం కాక తల్లిదండ్రులు, అదే ఏరియాలో కోట్ల ఆస్తి ఉండి, పలు సందర్భాల్లో ఆమెపై తమప్రేమను ఎక్స్ ప్రెస్ చేసిన వాళ్లు, ఆమె స్నేహితులు తలబద్దలయ్యేలా ఆలోచిస్తుంటారు. జుట్టుపీక్కుంటుంటారు. ఇప్పుడు మనం కొంతమంది డబ్బున్న అమ్మాయిలు.., జులాయిల్నే ఎందుకు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ విషయం గురించి తెలుసుకోవాలంటే ముందు ఓ చిన్న స్టోరీ గురించి తెలుసుకుందాం.
హైదరాబాద్ శిల్పారామంలో బొమ్మల ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఆ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన శిల్పాల్ని చూసేందుకు టాలీవుడ్ కు చెందిన డైరెక్టర్లందరూ వచ్చారు. ఆ బొమ్మల్ని చూసి అలా ఉన్నాయి. ఇలా ఉన్నాయి అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. కానీ డైరెక్టర్ జక్కన్న మాత్రం పక్కనే ఉన్న బండరాయిని చూసి తెగ ఆనంద పడిపోతున్నాడు. దీంతో కంగుతిన్న మిగిలిన డైరెక్టర్లు అదేంటి జక్కన్న మేం శిల్పాల్ని చూస్తుంటే మీరు బండరాయిని చూసి ఎందుకు ఆనందపడిపోతున్నారని అడుగుతారు. అందుకు ఆయన ఏమన్నాడో తెలుసా..? మీరు చెక్కిన శిల్పాల్ని మాత్రమే చూస్తున్నారు. కానీ నేను మాత్రం ఆ బండరాయి లోపల ఉన్న అందమైన బొమ్మని చూస్తున్నాను. ఎందుకంటే? నేను ఆ బండరాయిని ఓ శిల్పంగా మార్చి దానికి ప్రాణం పోస్తే.. ఆ బండరాయి ఎంత అందంగా ఉంటుందో ఊహించుకొని సంబరపడిపోతున్నాను. అదే చెక్కిన శిల్పాల్ని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటే ఆ శిల్పాలు నన్ను చూసి వెక్కిరిస్తాయి. నువ్వు బొమ్మల్ని మాత్రమే కలెక్ట్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటావా అని ఎగతాళి చేస్తాయి. అదే బండరాయిని శిల్పంగా మారిస్తే అది నన్ను ఆరాధిస్తుంది. పూజిస్తుంది. అందుకే ఎగ్జిబిషన్ లో ఇన్ని బొమ్మలున్నా. నేను బండరాయిని చూసి ఆనందపడిపోతున్నట్లు చెప్పాడు జక్కన్న. ఇది అస్సలు స్టోరీ.
ఇక డైరెక్ట్ గా కథలోకి ఎంటరైతే..! సైకాలజీ లేదంటే , చరిత్ర ప్రకారం, ధనవంతుల ఇళ్లల్లోని తల్లిదండ్రులు తమ పిల్లల్ని పెంచే విధానాన్ని థియరిటికల్ గా , ప్రాక్టికల్ చూస్తే ఆడపిల్లలు జులాయిల్ని ఎందుకు ఇష్టపడతారో తెలుస్తుంది.
జూబ్లిహిల్స్ కు చెందిన శేఖర్, శ్రేష్ఠ దంపతుల గారాల పట్టి శ్రేయ. శ్రేయను తల్లిదండ్రులైన శేఖర్, శ్రేష్ఠలు గారాబంగా పెంచారు. సైకిల్ అడిగితే స్కూటీ కొనిచ్చేంత. స్కూటీ అడిగితే కారు కొనిచ్చేంతా. అది సరిపోదున్నట్లు వేల కోట్ల కంపెనీలు, ఆస్తులన్నీ ఆమె పేరు మీద రాసి ఉక్కిరి బిక్కిరయ్యేలా తనకు అవసరం లేని ప్రేమను పంచుతున్నారు. తనకు అవసరం లేని ప్రేమను సైతం ఆమెపై బలవంతంగా రుద్దుతున్నారు. అదే సమయంలో శేఖర్, శ్రేష్ఠలు కీలక నిర్ణయాల తీసుకునే సమయంలో యమునను పట్టించుకునే వారు కాదు. అదేంటని ప్రశ్నిస్తే నీకేం తెలియదు. నువ్వో చిన్నపిల్లవి అంటూ సర్ధి చెప్పేవారు. నాకు ఇదంటే ఇష్టం. లేదంటే అదినాకిష్టం లేదనే స్వేచ్ఛను ఇవ్వకపోవడంతో శ్రేయ బయటి ప్రపంచానికి తెలియని అతీత శక్తులతో లోలోపల పోరాడుతుంది. కాలం గిర్రును తిరిగింది. శ్రేయ అదే ఏరియాలో జులాయిగా తిరిగే రాఖీని పెళ్లి చేసుకుంటుంది. దీంతో షాక్ తిన్న శేఖర్, శ్రేష్ఠలు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ జులాయితో నీకు పెళ్లేంటి తల్లి ? వాడో జులాయి. తాగుబోతు. ఉమనైజర్. వాడు నిన్ను సరిగ్గా చూసుకోడు. అందుకే కోట్ల ఆస్తి ఉన్న అబ్బాయినో, మంచిగా చూసుకునే అబ్బాయినో నీకిచ్చి పెళ్లి చేస్తామని సముదాయించారు. శ్రేయ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. జులాయినే మార్చుకుంటానని తెగేసి చెప్పింది. అందుకు కారణం
శ్రేయకు పుట్టినప్పటి నుంచి పెళ్లి వయస్సు వచ్చే వరకు గారాబంగా పెరిగింది. యుక్త వయస్సు వచ్చే సరికి ఆమె తన ప్రేమను పంచాలనుకుంది. అందనంత ఎత్తులో ఉండాలనుకుంది. కానీ అలా సాధ్యపడలేదు. ఇంట్లో కుటుంబసభ్యులు చూస్తే అలా ఉన్నారు. మళ్లీ ఇప్పుడు ఏ కోటీశ్వరుడినో, మంచి మనస్సున్న అబ్బాయినో పెళ్లి చేసుకుంటే.., మళ్లీ అదే ప్రేమకు బలికావాల్సి వస్తుంది. కేర్ చేయరు. అందుకే ఓ జులాయిని పెళ్లి చేసుకుని .., ఆ జులాయిని మారిస్తే..! వాళ్ల నుంచి వచ్చే రెస్పాన్స్ ను బయటకు తీయాలి. ఆ రెస్పాన్స్ ఎలా ఉండాలంటే ” శ్రేయను చూస్తూ ఏయ్ ఇటు చూడు. నువ్వు లేకపోతే నేనున్నానా..? రోడ్డు మీద జులాయిలా తిరుగుతున్న నన్ను పెళ్లి చేసుకొని మనిషిలా మార్చావ్. నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా..? దేవుడు నాకు పెట్టిన కష్టాలన్నింటికి వడ్డీతో సహా నిన్ను నాకు ఇచ్చాడనిపిస్తుంది. నేనెన్ని కష్టాల పడ్డా నువ్వొచ్చిన తరువాత దేవుడికి థ్యాంక్స్ చెప్పాను. నువ్వొచ్చిన తరువాత ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయాయని పిస్తుంది. ఎన్ని సమస్యలున్నా వాటితో ఫైట్ చేయాలనిపిస్తుంది. నిన్ను ప్రేమించడం లేదా..? నీకు మైండ్ పోయిందా..? నువ్వు లేకపోతే నేను లేను. నిజంగా చెబుతున్నా. నువ్వు లేకపోతే నేను లేనురా…! ఇదిగో రెస్పాన్స్ ను కోరుకుంటారు. వారికి కావాల్సింది ఇలాంటివ్యాల్యూనే. ఒకమ్మాయి తల్లిదండ్రుల దగ్గర ప్రేమించడం ఇలా అని నేర్చుకుంటుంది. ఇదే ప్రేమ వేరే వాళ్లకు ఇవ్వాలని అనుకుంటుంది. అందుకే అల్రెడీ డబ్బులున్న వాళ్లకంటే చూడటానికి అసహ్యంగా, జులాయిగా తిరిగే వాడిని పెళ్లి చేసుకుంటే నాకు ప్రయారిటీ ఇస్తాడని ఊహించి ప్రపంచంలోనే బేవర్సైన రాఖీలాంటి వ్యక్తిని శ్రేయలాంటి ధనవంతుల అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. పెళ్లి తరువాత రాఖీ నుంచి ఎన్నడూ దొరకని ప్రేమను పొందుతుంది. అతనిని ఓ మనిషిగా మారుస్తుంది. ఇంతటితో స్టోరీ సమాప్తం.
పై స్టోరీ ఎవరిని ఉద్దేశించింది కాదు. ఇందులోని పేర్లు కేవలం కల్పితం మాత్రమే. తల్లిదండ్రుల అతిగారాబం పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో పాఠకులకు అందించాలనేదే మా “దిశ” తాపత్రయం.
content source : YouTube, google