- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రాయలసీమ’కు వెళ్తారా… లేదా..?
దిశ, తెలంగాణ బ్యూరో : జల వివాదాలను కేంద్రం కూడా సాగదీస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలనకు నిపుణుల కమిటీ వెళ్లడంపై ఇంకా ఎటూ తేల్చడం లేదు. శని, ఆది వారాల్లో నిపుణుల కమిటీ ఉంటుందని అధికారులు భావించినా… శుక్రవారం రాత్రి వరకు కూడా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో పర్యటనపై సందిగ్ధం నెలకొంది.
కృష్ణా జల వివాదాల్లో భాగంగా రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణంపైనే ఎక్కువ ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. దీనిపై ఎన్జీటీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నుంచి కేఆర్ఎంబీకి ఆదేశాలిచ్చారు. కేఆర్ఎండీ, సీడబ్ల్యూసీ నుంచి నిపుణుల కమిటీ వెళ్లాలని, రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు, ఆ ప్రాంతాన్ని పరిశీలించాలని ఆదేశించింది. వాస్తవంగా ఏప్రిల్‌లోనే ఈ కమిటీ పర్యటన ఉండగా… వాయిదా పడింది. దీనిపై ఇటీవల ఎన్జీటీ కూడా సీరియస్అయింది. వెంటనే నిపుణుల కమిటీ పరిశీలన చేయాలని, ఈ నెల 12లోగా నివేదిక ఇవ్వాలని, లేకుండా ఏపీ సీఎస్‌ను జైలుకు పంపుతామని హెచ్చరికలు జారీ చేసింది.
ఎందుకంటే నిపుణుల కమిటీ పర్యటనను ఏపీ అడ్డుకోవడంతో ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది. మరోవైపు కేంద్రం కూడా నిపుణుల కమిటీ తీరును తప్పు పట్టింది. కేంద్రం నియామకం చేసిన కమిటీ రాష్ట్రాల అనుమతి కోరడాన్ని ప్రశ్నించింది. రాయలసీమ ప్రాంతానికి వెళ్లాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 3 లేదా 4 తేదీల్లో పర్యటన ఉంటుందని భావించారు. అయితే పర్యటనపై కేఆర్ఎంబీ పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ఏపీ పోలీసులను నమ్మి వెళ్లలేమని, కేంద్ర బలగాల భద్రత కావాలంటూ సూచించింది. కేంద్ర జలశక్తికి పంపించిన ఈ లేఖపై తిరుగు సమాధానం రాలేదు. దీంతో నిపుణుల కమిటీ పర్యటన ఎప్పుడు ఉంటుందనేది తెలియడం లేదు.