- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేయర్ పీఠం టీఆర్ఎస్‌దే..!
దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ మేయర్ పీఠం టీఆర్ఎస్‌దేనంటూ ‘ఆరా’ తన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాల్లో వెల్లడించింది. మొత్తం పోలైన ఓట్లలో 40%కి పైగా టీఆర్ఎస్ పార్టీకే పడ్డాయని, మొత్తం 78 డివిజన్లలో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఏడు సీట్లు ఎక్కువ తక్కువ వచ్చినా దాదాపు మ్యాజిక్ ఫిగర్‌ను సొంతం చేసుకుంటుందని పేర్కొంది. బీజేపీకి 31% మేర ఓట్లతో కేవలం 28 డివిజన్లు మాత్రమే దక్కే అవకాశం ఉందని పేర్కొంది. ఇక మజ్లిస్ పార్టీకి 41 డివిజన్లు (13.43%), కాంగ్రెస్‌కు 3 డివిజన్లు (8.58%) చొప్పున దక్కనున్నట్లు పేర్కొంది. పోలింగ్ సరళిని పరిశీలించిన తర్వాత ఈ నెల 1వ తేదీ సాయంత్రమే ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించే అవకాశం ఉన్నా ఓల్డ్ మలక్‌పేట్ (26వ డివిజన్)లో రీపోలింగ్ కారణంగా వాయిదా పడింది. ఈ నెల 2, 3 తేదీల్లో నగరంలోని అన్ని వార్డుల్లో పోస్ట్ పోల్ సర్వే నిర్వహించిన ‘ఆరా’ చివరకు అత్యధిక స్థానాలతో టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని కైవశం చేసుకుంటుందని పేర్కొంది.
గత ఎన్నికల్లో 99 స్థానాల్లో గెలిచిన టీఆర్ఎస్ ఈసారి మాత్రం ఇరవై తక్కువ స్థానాలు పొందనుంది. అలా తగ్గిపోయిన స్థానాలన్నీ బేజేపీకే దక్కుతున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ కేవలం నాలుగు స్థానాల్ల మాత్రమే గెలుపొందింది. ఈసారి మాత్రం 28 దాకా చేరుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మజ్లిస్ గత ఎన్నికల్లో 44 స్థానాల్లో గెలుపొందినా ఈసారి మాత్రం మూడు తగ్గే అవకాశం ఉందని, కాంగ్రెస్ ఒక స్థానాన్ని అధికంగా పొంది మూడు స్థానాలకు పరిమితం అవుతుందని ‘ఆరా’ పేర్కొంది.
ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సాయంత్రం వరకూ పోలింగ్ మందకొడిగా సాగి 35% కూడా దాటని పరిస్థితుల్లో బీజేపీ దాదాపు ఆశలు వదులుకుంది. ఏ పార్టీ గెలుస్తుందో ప్రజల్లోనేకాక పార్టీల్లోనూ స్పష్టత లేకుండాపోయింది. అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ నేతలు కూడా నిర్దిష్టంగా మ్యాజిక్ ఫిగర్ (76 డివిజన్లలో గెలుపు) వస్తుందా రాదా అనే సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికీ ఆ రెండు పార్టీలకూ పూర్తి కాన్ఫిడెన్స్ లేదు. ‘ఆరా’ సర్వేతో రెండు పార్టీలూ దాదాపు ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది.
‘ఆరా’ సర్వే సంస్థ
టీఆర్ఎస్ – 40.08% – 78 సీట్లు (+/-7)
బీజేపీ – 31.21% – 28 సీట్లు (+/-5)
మజ్లిస్ – 13.43% – 41 సీట్లు (+/-5)
కాంగ్రెస్ – 8.58% – 03 (+/-3)
‘సీపీఎస్’ సర్వే సంస్థ
టీఆర్ఎస్ – 39.8% – 82-96 సీట్లు
బీజేపీ – 27.9% – 12-20 సీట్లు
మజ్లిస్ – 13.4% – 32-38 సీట్లు
కాంగ్రెస్ – 14.7% – 03-05
‘పీపుల్స్ పల్స్’ సర్వే సంస్థ
టీఆర్ఎస్ – 38% – 68-78 సీట్లు
బీజేపీ – 32% – 25-35 సీట్లు
మజ్లిస్ – 13% – 38-42 సీట్లు
కాంగ్రెస్ – 12% – 01-05