అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ విడుదల

by Shamantha N |
shashikala
X

దిశ, వెబ్‌డెస్క్: అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ మేరకు శశికళకు అధికారిక పత్రాలను జైలు అధికారులు అందజేశారు. శశికళ అవినీతి కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష అనుభవించారు. ఈ నెల 20న కరోనా బారిన పడిన ఆమె.. ప్రస్తుతం విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం శశికళ ఆరోగ్యం మెరుగ్గా ఉందని.. కానీ మరో 10 రోజులు ఆస్పత్రిలో ఉండాలని వైద్యులు సూచించారు.

Advertisement

Next Story