- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్‌డౌన్‌లో లైసెన్సు ఫీజు మినహాయించండి
దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ నేపథ్యంలో 45రోజుల పాటు వ్యాపారం కోల్పోయిన తమకు ఊరట కల్పించాలని తెలంగాణ వైన్ డీలర్ల అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధులు డి.వెంకటేశ్వర్ రావు, వి.రామచంద్రారెడ్డి తెలంగాణ ఎక్సైజ్ కమిషనర్‌కు మంగళవారం లేఖ రాశారు. ప్రస్తుత త్రైమాసికంలో లాక్‌డౌన్‌తో వ్యాపారం కోల్పోయిన 45రోజులకు లైసెన్సు ఫీజును ఇప్పటికే చెల్లించినందున ఈ ఫీజును వచ్చే త్రైమాసికం కోసం జూన్‌లో చెల్లించబోయే వాయిదాలో మినహాయించుకోవాలని వారు కోరారు. తమకు కేటాయించిన ఏడాది కాలం ముగిశాక ప్రభుత్వం ఈ 45 రోజుల కాలాన్ని షాపులు నడిపేందుకు అదనంగా అనుమతిస్తే అప్పుడు డబ్బు చెల్లిస్తామని వారు తెలిపారు. లేదంటే తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఒక్కో షాపు కోటి రూపాయలు పెట్టి తీసుకున్న తమకు ఏడాదిలో 365 రోజులూ కీలకమని, సగటున రోజుకు రూ.35వేల దాకా లైసెన్సు ఫీజు చెల్లిస్తున్నామని తెలిపారు. అంతేగాక తాజాగా మద్యంపై ప్రభుత్వం పెంచిన స్పెషల్ ఎక్సైజ్ సెస్ కారణంగా తాము మద్యం కొనుగోలుకు అధికంగా చెల్లిస్తున్నామని, రోజు సాయంత్రం 6 గంటలకే షాపులు మూయడం వల్ల ఇప్పటికీ తాము చాలా వరకు వ్యాపారం కోల్పోతున్నామని లేఖలో వివరించారు. కరోనా కష్టాలు ఇంకా ఎన్నిరోజులు కొనసాగుతాయో భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియని అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నందున తమకు లైసెన్సు ఫీజు విషయంలో ముందస్తు ఉపశమనం కల్పించాలని వారు కమిషనర్‌ను విజ్ఞప్తి చేశారు.