- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏడేళ్లలో పెరిగిన ఎక్సైజ్ సుంకం వసూళ్లు
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో సామాన్యుల అధికంగా వినియోగించే వాటిలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కీలకమైనవి. వీటి ధరల పెరుగుదల వల్ల సామాన్యులు నిత్యావసరాల ధరల భారాన్ని కూడా ఎదుర్కొంటారు. అలాంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు గత ఏడేళ్ల కాలంలో భారీగా పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరం నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరం మధ్యకాలంలో ఈ వస్తువులపై ఎక్సైజ్ సుంకం వసూళ్లు 96 శాతం పెరిగినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
అధికారిక గణాంకాల ప్రకారం.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ మూడింటి నుంచి 2013-14లో రూ. 12,35,870 కోట్లను వసూలు చేయగా, 2020-21(2021-జనవరి వరకు) ఈ మూడింటిపై ఎక్సైజ్ సుంకం వసూళ్లు రూ. 24,23,020 కోట్లకు చేరుకున్నాయి. అంటే ఏడేళ్లలో 96 శాతం పెరిగింది. అంతేకాకుండా సమీక్షించిన కాలంలో పెట్రోల్, డీజిల్ ధరల మధ్య వ్యత్యాసం కూడా చాలా తగ్గిపోయింది. ఇక ఈ ఏడాదిలో పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 100 చేరుకుంది. మరీ ముఖ్యంగా, 2020 మార్చి 24న కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్‌డౌన్ విధించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోకుండా ఏప్రిల్ నుంచి పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచింది.