- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వైన్ షాపులకు బార్లలోని బీర్లు
దిశ, న్యూస్‌బ్యూరో: బార్లు, క్లబ్బులు, టూరిజం బార్లలోని యూస్ బై డేట్ సమీపిస్తున్న బీర్లను ఆయా ఎక్సైజ్ స్టేషన్ల పరిధులలోకి వచ్చే వైన్ షాపులకు అమ్ముకోవచ్చని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్, ఎస్‌హెచ్‌ఓలకు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ శనివారం అంతర్గత సర్క్యలర్ జారీ చేశారు. గత నెల 15న బార్, క్లబ్బు నిర్వాహకులు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి ఆధారంగా వాటిలో ఉన్న బీరు స్టాకును వైన్ షాపులకు తరలించాలని నిర్ణయించినట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ నెల 9 కల్లా బీర్ల తరలింపు ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. మే 5వ తేదీన టీఎస్‌బీసీఎల్ బీర్లు ఏ ధరకు అయితే అమ్మిందో అదే ధర చెల్లించాలని పేర్కొన్నారు. మే 15వరకు అన్ని బార్లు, క్లబ్బుల్లో ఉన్న లిక్కర్ స్టాకు తనిఖీ జరిగినందున ఆ పరిమాణాన్ని బట్టి దగ్గర్లోని వైన్ షాపులకు లేదంటే అదే ఎక్సైజ్ జిల్లాలోని ఇతర షాపునకు తరలించాలని కోరారు. ఆయా ప్రాంతాల ఎక్సైజ్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు ఈ బీరు తరలింపు ప్రక్రియకు బాధ్యులని పేర్కొన్నారు. డిప్యూటీ కమిషర్, డిప్యూటీ ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని ఆదేశించారు.