- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గులాబ్ ఎఫెక్ట్.. పరీక్షలు వాయిదా
దిశ, తెలంగాణ బ్యూరో: భారీ వర్షాల కారణంగా జేఎన్టీయూ, ఓయూ, బీఆర్అంబేద్కర్ ఓపెన్యూనివర్సిటీల పరిధిలో 28, 29వ తేదీల్లో నిర్వహిస్తున్న అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గులాబ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. కాగా జేఎన్ టీయూ పరిధిలో నిర్వహిస్తున్న బీటెక్, బీఫార్మ్, డీ ఫార్మ్, ఫార్మ్‌డీ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఓయూలో 28, 29వ తేదీల్లో పరీక్షలు వాయిదా వేయగా.. తొలుత ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 30వ తేదీన పరీక్ష నిర్వహిస్తామని అధికారులు స్పష్టం చేశారు. బీఆర్అంబేద్కర్ ఓపెన్ యునివర్సిటీ పరిధిలో వాయిదా వేసిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని, వివరాలు www.braouonline.inలో పొందొచ్చని పేర్కొన్నారు.