బిగ్ బ్రేకింగ్.. టీఆర్ఎస్‌లోకి ఎల్.రమణ.. కండువా కప్పిన కేసీఆర్

by Anukaran |   ( Updated:2023-12-17 15:12:15.0  )
kcr,-l.ramana
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగుదేశం పార్టీ మాజీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్‌‌లో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో శుక్రవారం ప్రగతిభవన్‌లో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. రమణతో పాటు పలువురు టీడీపీ కీలక నేతలు, ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ఎల్.రమణ తనకు మంచి మిత్రుడని, ఎక్కడున్నా తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేస్తాడని ఆసక్తకిర వ్యాఖ్యలు చేశారు. రమణకు మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుందని తెలిపారు. చేనేత వర్గానికి రాజకీయ ప్రాధాన్యత కావాలని, చేనేతలను బాధల నుంచి విముక్తి కలిగించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. అంతేగాకుండా.. చేనేత కార్మికులకు బీమా అందిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed