- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పర్ మానేర్ పై ఎందుకంత వివక్ష?
దిశ, కరీంనగర్ :
సిరిసిల్ల నియోజకవర్గంలోనే ఉన్న అప్పర్ మానేర్ ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంత వివక్ష చూపుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన..మిడ్ మానేరు నుంచి రంగనాయక, కొండ పోచమ్మసాగర్‌లకు నీటిని తరలించుకపోవడానికి గల కారణాలెంటో చెప్పాలన్నారు. అప్పర్ మానేరు ప్రాజెక్టులోకి నీటికి తరలించకపోవడానికి ఐటీ మంత్రి కేటీఆర్ అసమర్థతే కారణమా లేక ఉద్దేశ్యపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తున్నారా అని మండిపడ్డారు. మిడ్ మానేర్ నుంచి మల్కపేట, ముస్తఫానగర్, అప్పర్ మానేరుకు నీటిని తరలించాల్సి ఉందని అయినా, ఈ ప్రాజెక్ట్‌కు ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా ఉండటం సమంజసం కాదన్నారు.అప్పర్ మానేరు పై నిర్లక్ష్యం వహించడానికి గల కారణాలను ఇక్కడి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కేటీఆర్ జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 6 ఏళ్లు గడిచినా అప్పర్ మానేరు నిర్మాణం పూర్తి కాకపోవడానికి కారకులు ఎవరని అడిగారు.ఈ విషయంపై మంత్రి కేటీఆర్ ఎదురుదాడికి దిగకుండా అప్పర్ మానేరు ప్రాజెక్టు పర్యటనకు వచ్చి నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారో ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలని పొన్నం కోరారు. కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, సిరిసిల్ల టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్యలు ఉన్నారు.