- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దండయాత్ర చేస్తాం.. మోడీ, కేసీఆర్‌లను దోషులుగా నిలబెడుతాం: షబ్బీర్ అలీ
దిశ, కామారెడ్డి: ప్రజల కొరకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలపై దండయాత్ర మొదలుపెడుతామని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎర్రవల్లిలో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం పనికిమాలిన చర్య అని మండిపడ్డారు. దీనికితోడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అరెస్ట్ చేయడం సరికాదన్నారు.
ఎర్రవెల్లి కేసీఆర్ ఫామ్ హౌస్‌లో 150 ఎకరాలలో వరి పంటలు వేసిన అంశాన్ని మీడియాకు చూపిస్తానని రేవంత్ రెడ్డి వెల్లడించడంతోనే.. కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టిందన్నారు. ఆ భయంతోనే అర్థరాత్రి నుంచే రేవంత్ రెడ్డి ఇంటి ముందు పోలీసులను మోహరింపజేశారన్నారు. ఈ చర్య ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టని షబ్బీర్ అలీ చెప్పుకొచ్చారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా రైతులను మోసం చేస్తున్న కేసీఆర్, మోడీలను ప్రజాకోర్టులో దోషిగా నిలబెడుతామని హెచ్చరించారు. రైతులపక్షాన పోరాడే దమ్ము, ధైర్యం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు.