కీలక భేటీ.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన ఈటల

by Anukaran |   ( Updated:2021-05-25 00:33:59.0  )
ex minister Etela Rajender, Union Minister Kishan Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డిని మాజీ మంత్రి ఈటల రాజేందర్ కలిశారు. ఇటీవల భూ ఆక్రమణ వ్యవహారంలో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన ఈటల తన రాజకీయ భవిష్యత్తుపై కిషన్ రెడ్డితో కీలకంగ చర్చిస్తున్నట్టు సమాచారం. ఈటల కొత్త పార్టీ పెట్టబోతున్నాడని విస్తృతంగా ప్రచారం జరుగుతోన్న సమయంలో కిషన్‌రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫామ్‌హౌజ్‌లో ఇరువురు మంగళవారం సమావేశం అయ్యారు.

కాగా, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన ఈటల.. అనుకూల నేతలను కలుస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో రహస్య మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. అనంతరం పలువురు బీజేపీ నేతలను కూడా కలిశారు. ప్రస్తుతం మొయినాబాద్‌లోని బీజేపీ నేత వివేక్ వెంకటస్వామికి చెందిన ఫాంహౌస్‌లో కిషన్ రెడ్డితో పాటు పలువురు కీలక నేతలతో రహస్య మంతనాలు జరుపుతునట్లు తెలుస్తోంది. వీరితో పాటు బీజేపీ జాతీయ నాయకుడు భూపేందర్ యాదవ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే కూడా హాజరైనట్లు సమాచారం. భేటీ అనంతరం ఈట‌ల ఏ నిర్ణయం తీసుకుంటారోన‌న్న ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది.

Advertisement

Next Story

Most Viewed