- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాపై జగన్ చర్యలను సమర్థించిన జనసేన మాజీ నేత
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జనసేన మాజీ నేత, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీ నారాయణ అభినందించారు. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల నిర్వహణ చాలా మంచిదని ఆయన అన్నారు. పరీక్షలు పెద్దఎత్తున నిర్వహిస్తున్న నేపథ్యంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు కనిపించినా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మరణాల సంఖ్య తక్కువగానే ఉందని అన్నారు.
కరోనా నిర్ధారణ పరీక్షలు పెద్దఎత్తున నిర్వహించడమే ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కారణమని ఆయన చెప్పారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కరోనా పరీక్షలను చేయడంలో ఏపీ పనితీరు అద్భుతంగా ఉందని చెప్పారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల ప్రకారం, ఎన్ని ఎక్కువ టెస్ట్‌లు చేస్తే అంత మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. టెస్టులు ఎక్కువగా జరిగిన ప్రాంతాల్లో కేసులు అధికంగా నమోదవుతున్నా, మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉందని చెప్పారు.
ఇతర అనారోగ్య సమస్యల వల్లే కరోనా మృతులు పెరుగుతున్నారని ఆయన చెప్పారు. మే 3 తరువాత పంజాబ్, ఒడిశాలు లాక్ డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రకటించాయని, తెలంగాణలో కూడా లాక్‌డౌన్ పొడిగింపు మరో 4 రోజుల పాటు కొనసాగుతుందని సీఎం కేసీఆర్ తెలిపారని గుర్తుచేశారు. రానున్న మూడు రోజుల్లో ఆరంజ్ జోన్లను గ్రీన్ జోన్లుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని ఆయన అన్నారు. లాక్‌డౌన్ దశలవారీగా సడలిస్తూ రెడ్ జోన్లపై మరింత దృష్టిని సారించాలని ఆయన సూచించారు.
Tags: janasena, lakshmi narayana, ysrcp, ap government, corona crisis