- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎల్లమ్మ దివేనతో సుభిక్షంగా ఉండాలి
దిశ, చిట్యాల: రేణుక ఎల్లమ్మ తల్లి దివేనలతో వర్షాలు సమృద్ధిగా కురిసి కరువు కాటకాలు లేకుండా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్ రూరల్ జడ్పిచైర్ పర్సన్ గండ్ర జ్యోతి దంపతులు ఆకాంక్షించారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని తాటి వనంలో గౌడ కులస్తులు నిర్మించిన రేణుక ఎల్లమ్మ గుడి ప్రారంభోత్సవ పూజల్లో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు.వారికి పూజారులు ప్రత్యేక పూర్ణకుంభంతో ఆహ్వానం పలికారు.అనంతరం అమ్మకారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌడ కులస్థులంతా ఏకమై గౌరవ ప్రదంగా ఏర్పాటు చేసుకున్న ఆలయం శుభపరిణామమని ఆనందం వ్యక్తం చేశారు.
రేణుక ఎల్లమ్మ దివ్య ఆశీస్సులు చిట్యాల మండల ప్రజలకు ఉండాలని,వర్షాలు సంవృద్దిగా కురిసి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరారు.అలాగే గౌడ కులస్తులకు ప్రభుత్వం అన్నివిధాలుగా సహాయసాకారాలు అందిస్తున్నదని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో గౌడ కులస్తుల అవసరాలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ దావు వినోద వీరారెడ్డి, జడ్పీటీసీ గొర్రె సాగర్,పులి తిరుపతి రెడ్డి,సర్పంచ్ ఇరుకులపాటి పూర్ణచందర్ రావు, ఎంపీటీసీ కట్కూరి పద్మ నరందర్,వైస్ ఎంపీపీ నిమ్మగడ్డ రాంబాబు, ప్రధాన కార్యదర్శి అరపెల్లి మల్లయ్య,టౌన్ అధ్యక్షుడు పాండ్రాల వీరస్వామి,గౌడ సంఘం అధ్యక్షుడు బుర్ర శ్రీధర్ పాల్గొన్నారు.