యం.యల్.సి ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి..

by Shyam |
యం.యల్.సి ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి..
X

దిశ, సూర్యాపేట: జిల్లాలో శుక్రవారం జరిగే స్థానిక సంస్థల యం.యల్.సీ ఎన్నికల నిర్వహణకు నియమించిన అధికారులు సమర్ధవంతంగా పోలింగ్ నిర్వహణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోలింగ్ నిర్వహణకు నియమించిన అధికారులు సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ యస్.మోహన్ రావు తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ రోజున నిర్వహణ సిబ్బంది అప్రమత్తంగా ఉండి పోలింగ్‌ను సమర్డవంతంగా నిర్వహించాలని సూచించారు.

పోలింగ్ నిర్వహణకు 27 మంది సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు. ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు ఓటర్ గుర్తింపు అధికారులుగా విధులు నిర్వహిస్తారని అన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని ముఖ్యంగా కరోనా నిబంధనలు పాటిస్తూ.. అన్ని కేంద్రాల్లో నిరంతర విద్యుత్, తాగునీరు వైద్య సిబ్బంది ని అందుబాటులో ఉంచాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్, కెమెరాలు , ఇతర వస్తువులు అనుమతి లేదని పోలీసులు నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ వీడియో గ్రాఫీ సక్రమంగా నిర్వహించాలన్నారు.

పోలింగ్ అనంతరం పోలింగ్ మెటీరియల్ ఎస్కాట్ వాహనాల్లో సెక్టోరియల్ అధికారుల సమక్షంలో నల్గొండ జిల్లా కేంద్రంలో అప్పగించాలని సూచించారు. సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్ పోలింగ్ కేంద్రాలకు రూట్ అధికారుల సమక్షంలో పోలింగ్ నిర్వహణ అధికారులు, సిబ్బంది మెటీరియల్ తో పాటు వాహనాలలో పంపించడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్.డి.ఓ లు సూర్యాపేట రాజేంద్ర కుమార్, కోదాడ కిషోర్ కుమార్, హుజూర్ నగర్ వెంక రెడ్డి, ఏ. ఓ శ్రీదేవి, ఎన్నికల పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు, పులి సైదులు, తహశీల్దార్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed