- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
-మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ (కొవిడ్-19) కేసుల్లో మారుతున్న గణంకాలు, తీవ్రత దృష్ట్యా పలు మార్గనిర్దేశాలను రాష్ట్ర ఆరోగ్య శాఖ జారీ చేసింది. ఇంటి నుంచి బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలనీ, ఈ బాధ్యతను జిల్లా కలెక్టర్లు, మెడికల్ అధికారులు పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రత్యేక చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని పని ప్రదేశాల్లోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మాస్క్‌లు ధరించాలని సూచించారు. మాస్క్‌లు ముక్కు, నోరును పూర్తిగా కప్పిఉంచేలా ఉండాలి.
గతంలోని ‘ అనారోగ్యానికి మాస్క్’ అని ఉన్న నినాదాన్ని ‘ఇంటి నుంచి బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ పబ్లిక్, సామాజిక ప్రదేశాల్లో మాస్క్ ధరించాలి’ అని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. కొవిడ్ -19 వైరస్ తుమ్మడం, దగ్గడం, జలుబు వంటి సందర్భాల్లో తుంపరాల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. జపాన్‌లో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం మాస్క్‌లు ధరించడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించినట్టు పేర్కొన్నారు.
మాస్క్ వినియోగంపై ప్రభుత్వం పలు సూచనలు చేసింది. వాటి ప్రకారం.. ఇండ్ల వద్ద ఉండేటపుడు, ఇతరులతో మాట్లాడే సందర్భాల్లోనూ మాస్క్‌లను ధరించాలని అందులో స్పష్టం చేశారు. చేతులను ఎప్పటికప్పుడూ శుభ్రం చేసుకోవడంతో పాటు మాస్క్‌లను కూడా శుభ్రమైన నీటితో ఉతకాలి. ఒకసారి వాడిన మాస్క్‌లను ఉతకకుండా రెండోసారి ఉపయోగించొద్దు. మాస్క్‌లను సాధారణ పద్ధతిలోనే వినియోగించాలి. కాని రెండు వైపులా మార్చి వాడకూడదు. అలా చేస్తే వైరస్ వ్యాపించే అవకాశాలు పెరుగుతాయి. ప్రతి ఆరు గంటలకోసారి మాస్క్ మార్చుకోవాలి. ఒకవేళ డిస్పోజబుల్ మాస్క్‌లు అయితే రెండో సారి వాడకండి. వాటిని ఉపయోగించడం అయిపోగానే చెత్తబుట్టలో వేసేయండి. మాస్క్‌లు తీసేటపుడు వాటి ముందు భాగాన్ని తాకకూడదు. మాస్క్‌లు తీసేసిన వెంటనే 70శాతం ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్లతో చేతులు కడుక్కోవాలి. సాధ్యమైనంత క్లాత్ మాస్క్‌లను వినియోగించండాన్ని ప్రోత్సహించాలి. వాటిని వేడినీటిలో 15 నిమిషాల పాటు మరిగించి శుభ్రపరుచుకోవాలి. అనంతరం 5 నిమిషాల పాటు ఇస్త్రీ చేయడం ద్వారా వేడికి అందులో ఉన్న సూక్ష్మ క్రిములు నశిస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా మాస్క్‌ల వినియోగాన్ని పెంచడం ద్వారా కరోనా నివారణను తొందరగా చేయొచ్చని రాష్ట్రప్రభుత్వం సూచించింది.
tags: corona, latest, mask, health, telangana