‘జనతా కర్ఫ్యూలో అందరూ భాగస్వామ్యం కావాలి’

by Shyam |
‘జనతా కర్ఫ్యూలో అందరూ భాగస్వామ్యం కావాలి’
X

దిశ, మహబూబ్‎నగర్: కరోనా (కోవిడ్-19) ప్రభలుతున్న నేపథ్యంలో.. ప్రజలు జలుబు, జ్వరం రాగానే కరోనా వచ్చిందని అపోహలకు, ఆందోళనకు గురికాకుండా వెంటనే పట్టణంలోని డాక్టర్, అధికారులను సంప్రదించాలని మంత్ర్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వారి కోసం 2000 పడకలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. గత 30 రోజుల నుంచి విదేశాలు, దూర ప్రయాణాలు చేసిన వారు స్వయంగా డాక్టర్లను, అధికారులను కలిసి తమ పేర్లను నమోదు చేసుకొని, చెకప్ చేయించుకోవాలన్నారు, డాక్టర్‎లు ఇచ్చే సూచనలను పాటించాలన్నారు. ఇంట్లోనే 14 రోజులు ఉండి స్వీయ నియంత్రణ, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పట్టణంలోని ప్రేమ్ నగర్, న్యూ టౌన్ లలో కొంతమంది దుబాయ్ వెళ్లి వచ్చినట్లు సమాచారం ఉందన్నారు. వారు వెంటనే అధికారులను కలిసి, డాక్టర్ల సలహాలు తీసుకోవాలి చెప్పారు. తరచూ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం లేదా శానిటైజర్‎ను ఉపయోగించాలని తెలియజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు రేపు ఉదయం నుండి 24 గంటల పాటు జనతా కర్ఫ్యూలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కోరారు.

Tags: srinivas goud, janatha curfew, carona virus, mahabubnagar

Advertisement

Next Story

Most Viewed