- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హిందీపై తమిళ్ వార్.. ట్రెండింగ్‌లో #Reject_Zomato
దిశ, ఫీచర్స్: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ Zomato కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌కు, తమిళనాడుకు చెందిన ఓ కస్టమర్‌కు మధ్య జరిగిన కన్వర్జేషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ట్విట్టర్‌లో షేర్ చేసిన వికాష్ అనే యూజర్.. ఎగ్జిక్యూటివ్ తనను ‘అబద్దాలకోరు’ అని పిలిచాడని, ‘ప్రతి ఒక్కరూ హిందీ తెలుసుకోవాలని’ సూచించాడని తెలిపాడు. అసలేం జరిగింది..?
వికాష్ అనే వ్యక్తి.. తను ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్‌కు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు జొమాటో కస్టమర్ కేర్‌ను ఆశ్రయించాడు. ఫుడ్ డెలివరీ చేసిన రెస్టారెంట్‌కు కాల్ చేసి రీఫండ్ వచ్చేలా చూడాలని అడిగాడు. కానీ అప్పటికే ఐదుసార్లు రెస్టారెంట్ ఓనర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించానని పేర్కొన్న ఎగ్జిక్యూటివ్.. అతడి లాంగ్వేజ్‌తో ప్రాబ్లమ్ ఉందని జవాబిచ్చాడు. అయితే మీ భాషా సమస్యతో తనకు సంబంధం లేదంటూ ‘జొమాటో’ నుంచే రీఫండ్ ఇవ్వండని ఆగ్రహం వ్యక్తం చేశాడు వికాష్. ఎగ్జిక్యూటివ్ మాత్రం ‘హిందీ జాతీయ భాష కాబట్టి ప్రతి ఒక్కరూ కొంచెమైనా తెలిసి ఉండాలి’ అని రిప్లయ్ ఇచ్చాడు. అతడి వివరణతో సంతృప్తిచెందని వికాష్.. ‘ఒకవేళ జొమాటో సర్వీస్ తమిళనాడులో అందుబాటులో ఉంటే, తమిళ్ తెలిసిన వ్యక్తులనే ఇందుకోసం నియమించాలి’ అని ఘాటుగా స్పందించాడు.
ఈ మేరకు తన పరిస్థితిని వివరిస్తూ ట్వీట్ చేసిన వికాష్.. ‘జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తే అందులో ఒక ఐటమ్ రాలేదు. నాకు హిందీ రాదు కాబట్టి కస్టమర్ కేర్ ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వలేమని చెప్పింది. భారతీయుడిగా నాకు ఖచ్చితంగా హిందీ తెలుసుకోవాలనే పాఠం కూడా నేర్పింది. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌కు తమిళ్ తెలియదు కాబట్టి నన్ను అబద్దాలకోరుగా ట్యాగ్ చేశాడు. మీరు కస్టమర్‌తో మాట్లాడే విధానం ఇదేనా@zomato’ అని పోస్ట్ చేశాడు. ఇది వైరల్ కావడంతో స్పందించిన జొమాటో కేర్.. దీన్ని ‘ఆమోదయోగ్యం కాని’ సంఘటనగా వర్ణిస్తూ సమస్యను పరిష్కరించేందుకు వికాష్‌ను సంప్రదించింది. తమ కస్టమర్ కేర్ ఏజెంట్ ప్రవర్తన పట్ల వికాష్‌కు క్షమాపణ చెప్పిన కంపెనీ.. ‘భారతీయ విభిన్న సంస్కృతి పట్ల నిర్లక్ష్యం’ వహించిన ఏజెంట్‌ను తొలగించినట్లు తెలిపింది.
అయితే కంపెనీ CEO, వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్.. ఆ తర్వాత ఉద్యోగిని తిరిగి నియమించారని, మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్‌లో సమస్యను పరిష్కరించారని ట్వీట్ చేశారు. ‘ఫుడ్ డెలివరీ కంపెనీ సపోర్ట్ సెంటర్‌లో ఎవరో తెలియక చేసిన తప్పు జాతీయ సమస్యగా మారింది. దేశ ప్రజలు కొన్ని విషయాల పట్ల సహనంగా ఉండాలి. ఇక్కడ ఎవరిని నిందించాలి?’ అంటూ ప్రశ్నించారు. ఇక ఈ వివాదంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్లు.. కస్టమర్ కేర్‌తో తాము ఎదుర్కొన్న సంఘటనలను షేర్ చేస్తుండటంతో ‘#Reject_Zomato’ ట్రెండింగ్‌కు దారితీసింది.