- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
18–45 ఏళ్ల వయసున్న అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలి
దిశ,తెలంగాణ బ్యూరో: తెలంగాణలో 18–45 సంవత్సరాల వయస్సు వారందరికీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా వ్యాక్సిన్ అందించేలా చర్యలు తీసుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్రంలో 18 నుంచి 45 సంవత్సరాలున్న వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తామని గతంలో సీఎం కేసీఆర్చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. వ్యాక్సినేషన్కోసం రూ.2,500 కోట్లు ఖర్చవుతుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు.
ప్రస్తుతం కరోనా విజృంభన కొనసాగుతుందని,అందువల్ల మే 1వ తేదీ నుంచి 18–45 సంవత్సరాలు కల్గిన వారికి వ్యాక్సిన్వేస్తున్నారా..? లేదా..? అనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్చేశారు. ఎన్నికల టైంలో సమస్యలపై సర్జికల్ స్ట్రైక్స్చేస్తామని చెప్పిన తెలంగాణ బీజేపీ ఎంపిలు.. కేంద్రం నుంచి అవసరమైనంత వ్యాక్సిన్ ను తెప్పించే బాధ్యత వారిపై లేదా..? అని ప్రశ్నించారు.