జోగిపేటలో ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

by Shyam |   ( Updated:2021-09-11 08:33:37.0  )
జోగిపేటలో ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ‌, అందోల్: రాష్ట్రంలో బీజేపీని విమ‌ర్శించ‌డం.. ఢిల్లీకి వెళ్లి దండాలు పెట్టడం కేసీఆర్‌కు అలవాటేన‌ని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శనివారం జోగిపేటలో బండి సంజయ్ పాదయాత్రకు మద్దతు తెలుపుతూ.. ఈటల ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తనను ఓడించేందుకు ప్రగతి భ‌వ‌న్‌లో కుట్రలు చేస్తున్నార‌ని… ఎవ‌రెన్ని కుట్రలు చేసినా హుజురాబాద్ నుంచే కేసీఆర్ ప‌త‌నానికి నాంది ప‌లికేందుకు ప్రజ‌లు సిద్ధంగా ఉన్నార‌ని పేర్కొన్నారు.

హ‌రీష్‌ రావు ఉద్యమాలు చేసిన‌ప్పుడు నెత్తిన పెట్టుకున్న ప్రజ‌లు.. కుట్రలు చేసినందుకు బండ‌కేసి కొట్టేందుకు సిద్ధమ‌వుతున్నార‌న్నారు. కేసీఆర్ నోట్ల క‌ట్టల‌కు, మ‌ద్యం సీసాల‌కు, అహంకారానికి, కుట్రల‌కు చ‌మ‌ర‌గీతం పాడేందుకు హుజురాబాద్ ప్రజ‌లు రెడీగా ఉన్నారంటూ ఈటల చెప్పుకొచ్చారు. వాళ్లు, వీళ్లెందుకు ద‌మ్ముంటే కేసీఆర్‌, హ‌రీశ్‌ రావులు ఏవరైనా రండి.. పోటీకి దిగండి.. అంటూ స‌వాల్ విసిరినా కనీసం నోటి నుంచి మాట రాలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమంటూ ఈటల ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story