- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్ పై ఈటల ప్రశంసల వర్షం
దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ 33 జిల్లాలో 100 పడకల ఆసుపత్రి లకు అనుమతి వచ్చింది. భూపాలపల్లి లో హాస్పిటల్ ఎప్పటి లోగా ప్రారంభిస్తారు? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అయితే గండ్ర ప్రశ్నోత్తరాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. సీఎం కేసీఆర్ సూచనలతో తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్స్ పేరుతో పరీక్ష కేంద్రాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. చిన్న చిన్న ప్రజా సమస్యల్ని పట్టించుకోక పోవడం వల్లే దీర్ఘకాలిక రోగాలుగా మారుతున్నాయని గమనించిన కేసీఆర్ ఆదిలోనే జబుల్ని గుర్తించేందుకు ఈ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రశంసించారు.
12 కోట్లతో నారాయణ గూడ లో అధునాతన ల్యాబ్ లో మొత్తం 60 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 19 గ్రామీణ ప్రాంతాలకు చెందిన పలు సెంటర్స్ లో ల్యాబ్‌లు, హైదరాబాద్ లో 12 కొత్త ల్యాబ్ లను ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో పాటూ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 54 హాస్పిటల్స్ ను అప్ గ్రేడ్ చేసుకున్నాం త్వరలో సిబ్బంది నియామకం చేసుకొని అన్నింటినీ ప్రారంభిస్తామని మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో ప్రసంగించారు.