- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నామినేషన్ విత్ డ్రా చేసుకున్న ఈటల జమున.. ఆంతర్యమేంటి..?
దిశ ప్రతినిధి, కరీంనగర్: ప్రత్యక్ష రాజకీయాల్లో భర్త చాటు భార్యగా తన వంతు బాధ్యతగా భర్త గెలుపుకోసం కృషి చేసే నారీమణులను చూశాం. కానీ, ఈవిడ మాత్రం కాస్తా డిఫరెంటనే చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు సార్లు నామినేషన్ వేశారు, ఆ తరువాత విత్ డ్రా చేసుకుంటున్నారు. ఆమె అంతరంగం అంతుచిక్కక ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు.
ఆది నుండి..
కరీంనగర్ జిల్లా కమలాపూర్ స్థానం నుండి 2014లో మొదటిసారిగా ఈటల రాజేందర్‌తో పాటు ఆయన సతీమణి జమున కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఆ తరువాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ రాజేందర్‌తో పాటు జమున నామినేషన్ వేస్తున్నారు, ఉపసంహరించుకుంటున్నారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన కారణంగా కమలాపూర్ నియోజకవర్గాన్ని తొలగించడంతో హుజూరాబాద్ నియోజకవర్గానికి ఈటల షిప్ట్ అయ్యారు. 2004 నుంచి ఇప్పటి వరకు జరిగిన జనరల్, బై ఎలక్షన్స్‌లో మొత్తం ఈటల రాజేందర్ ఏడు సార్లు బరిలో నిలిచారు. ప్రతి సారి కూడా ఆయన జీవిత భాగస్వామి జమున నామినేషన్ వేసి విత్ డ్రా చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లోనూ జమున తన నామినేషన్ ను ఉప సంహరించుకున్నారు.
సెంటిమెంటా.. అప్రమత్తతా..?
అయితే ఈటల జమున ప్రతి సారి నామినేషన్ వేయడం విత్ డ్రా చేసుకోవడానికి కారణం కేవలం సెంటిమెంటా లేక అప్రమత్తంగా ఉంటున్నారా అన్నదే పజిల్ గా మారింది. సెంటిమెంట్ లో భాగమేనని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం అప్రమత్తంగా ఉండేందుకేనని ఒక వేళ ఒకరి నామినేషన్ తిరస్కరణకు గురైనా మరొకరి నామినేషన్ ఆమోదం పొందితే బరిలో నిలిచే అవకాశం ఉంటుందంటున్న వారూ లేకపోలేదు. ఈటల జమున నామినేషన్ వేయడం విరమించుకోవడం మాత్రం పరిపాటిగా మారిందన్నది వాస్తవం.
రికార్డేనా..?
భర్తతో పాటు భార్య వరుసగా ఏడు సార్లు నామినేషన్ దాఖలు చేయడం ఉప సంహరించుకోవడం రికార్డని చెప్పకతప్పదు. ఒకే ఎన్నికలో అందులోనూ భర్త పోటీ చేసే స్థానం నుండే భార్య నామినేషన్ వేయడం ఆ తరువాత విత్ డ్రా చేసుకోవడం రికార్డేనని అంటున్నారు కొందరు. వరుసగా ఏడు సార్లు నామినేషన్ దాఖలు చేసి విత్ డ్రా చేసుకున్న క్యాండెట్ భార్యగా ఈటల జమున సరికొత్త రికార్డును సృష్టించినట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.