భయంతోనే ఎక్కువమంది చనిపోతున్రు: ఈటల

by Anukaran |
భయంతోనే ఎక్కువమంది చనిపోతున్రు: ఈటల
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా కంటే భయంతోనే ఎక్కువమంది చనిపోతున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం ప్రభుత్వాస్పత్రుల సూపరింటెండెంట్లు, డాక్టర్లతో ఆయన కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనాకు రాష్ట్రమంతా ఒకే వైద్య విధానం ఉండాలని సూచించారు. పాజిటివ్ పేషెంట్లలో ధైర్యం నింపాలన్నారు. ఎంత త్వరగా చికిత్స మొదలు పెడితే మరణాలు అంత తగ్గించవచ్చని వారికి సూచించారు.

Advertisement

Next Story