- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మంత్రి హరీశ్‌పై ఈటల షాకింగ్ కామెంట్స్.. మనం ఏడ్చింది నిజమో కాదో నీ భార్యను అడుగు..!
దిశ, కమలాపూర్ : ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ నిన్ను, నన్ను మోసం చేసి అవమానపరిస్తే మనం కన్నీరు పెట్టింది నిజం కాదా..? ఆ కన్నీరు మన ఇంటి తలుపులు తడితే.. నీ భార్య, నా భార్య చూసింది నిజం కాదా..? ట్రబుల్ షూటర్ అంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ఈటల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కడ ఎన్నికల ప్రచారానికి వెళ్లినా ప్రజలు తనకు ఘనస్వాగతం పలుకుతున్నారని గుర్తుచేశారు.ఈటల మనిషిని, శ్రమ, మానవత్వాన్ని నమ్ముకున్నాడని.. కానీ, కేసీఆర్ డబ్బు, మద్యం, అధికార దుర్వినియోగాన్ని నమ్ముకున్నాడని మండిపడ్డారు. ఈనెల 30న సారా సీసాలకు, అధికార దుర్వినియోగం, అక్రమ సంపాదనకు, దొంగ ఓట్లకు పాతర వేసే రోజని.. గుద్దుడు -గుద్దుతే దిమ్మతిరిగి హుజురాబాద్ జోలికి పోవద్దని అనుకోవాలని ఫైర్ అయ్యారు.
నా మీద భూ ఆక్రమణ ఆరోపణలు చేసి వాళ్ల పత్రికా చానెళ్ళలో నాపై తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. ఈటల రాజేందర్ మధ్యలో వచ్చిండు మధ్యలో పోయిండని అంటున్నారని, నా చరిత్ర 18 ఏళ్లు, నీ పార్టీ చరిత్ర 20ఏళ్లని.. చరిత్రలు కాదు ముఖ్యం? ఖలేజా ముఖ్యమని ఈనెల 30న యావత్ తెలంగాణకు నీ సంగతేందో.. నా సంగతేందో తెలుస్తుందన్నారు.
ఈ ఎన్నికలతో టీఆర్ఎస్ పార్టీకి మూడిందని, ఈటల ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. అదే మీరు ఓడిపోతే కేసీఆర్ అసెంబ్లీకి రావొద్దని, మొహం చూపించొద్దన్నారు. తన రాజీనామా వల్ల నియోజకవర్గానికి ఇంత డబ్బు, అభివృద్ధి వస్తున్నందుకు సంతోషంగా ఉందని, నా రాజీనామా వలన ప్రజల రుణం తీర్చుకుంటున్నానని, రాబోయే ఉపఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ఈటల పిలుపునిచ్చారు.