ఈటల ముందు తలవంచాల్సిందే.. సీఎంపై సంచలన వ్యాఖ్యలు

by Sridhar Babu |
MPP Pavani
X

దిశ, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా ఇళ్లందకుంట మండల ఎంపీపీ సరిగొమ్ముల పావని కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార బలం, ఆర్థిక బలం ఈటల రాజేందర్ ప్రజాబలం ముందు తలవంచుకోవాల్సిందేనని ఘాటు వ్యాఖ్యలు చేాశారు. సోమవారం ఎంపీపీ పావని ఆధ్వర్యంలో 18గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు మద్దతుగా నిలిచారు.

ఈ సందర్భంగా ఎంపీపీ పావని మాట్లాడుతూ…. ఈటల రాజేందర్ వ్యక్తి కాదని, ఓ శక్తి అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కు సమ ఉజ్జిగా ఈటల పని చేశారని గుర్తు చేశారు. ఈటల ఇల్లు అన్నదానానికి నిలయమన్నారు. రాజేందర్ తన కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వమన్నారా, ఆయన స్వార్థం కోసం ఏమైనా అడిగారా? ప్రజల కోసం పరితపించిన వ్యక్తిని ఇలా ఇబ్బందులకు గురి చేయడం మంచిది కాదని సీఎంకు హితవు పలికారు. బెదిరింపులకు బెదిరేది లేదని, ప్రలోభాలకు తలోగ్గేది లేదని పావని స్పష్టం చేశారు.

Pavani MPP

మండల సర్పంచులు మాట్లాడుతూ.. కేసీఆర్ వాపును చూసి బలుపు అనుకుంటున్నారన్నారు.
ఉద్యమంలో కొట్లాడినట్టే కేసీఆర్ చెర నుండి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు పోరాటం చేస్తామన్నారు.

Advertisement

Next Story