- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈటల బర్తరఫ్ చారిత్రక తప్పిదమా?
దిశ, తెలంగాణ బ్యూరో : వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం కేసీఆర్ చేసిన చారిత్రక తప్పిదమా అనే చర్చ పార్టీలోని ఒక సెక్షన్ నాయకుల్లో మొదలైంది. దాదాపు ఇరవై ఏండ్ల అనుబంధం ఉన్న ఈటలకు కరీంనగర్ జిల్లాలో మాత్రమే కాక రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమకారుడిగా గుర్తింపు ఉన్నది. ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించిన తీరుపై నియోజకవర్గ ప్రజల్లో భిన్నాభిప్రాయం కూడా వ్యక్తమైంది. చివరికి ఉప ఎన్నిక పోలింగ్‌లో ఓట్ల రూపంలో ఈటలపై సానుభూతి పవనాలు కనిపించాయి. ఉప ఎన్నిక ప్రచారంలో పార్టీ అధినేత కేసీఆర్‌నే సవాలు చేశారు. ఓడిపోతే రాజకీయాల నుంచే తప్పుకుంటానని, ధైర్యం ఉంటే తనపైన పోటీ చేయాలని వ్యక్తిగతంగా కేసీఆర్‌ను చాలెంజ్ చేశారు. చివరకు హుజూరాబాద్‌లో ఈటల గెలిచిన తర్వాత పార్టీలోని ఉద్యమకారుల్లో, ఒక సెక్షన్ నాయకుల్లో కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై గుసగుసలు మొదలయ్యాయి.
పార్టీ అధినేతగా ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్యమ వ్యతిరేకులను టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారని, వారికి ఉద్యమకారులకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శ చాలా కాలంగా ఉన్నది. పార్టీని అంటిపెట్టుకున్నవారిని దూరం చేసుకోవడమే కాక ఉద్యమం సమయంలో ప్రజలపై విరుచుకపడిన వ్యక్తులను చేర్చుకోవడంపై అసంతృప్తి కూడా ఉన్నది. వెనకబడిన సామాజికవర్గానికి చెందిన వ్యక్తిగా మాత్రమే కాక కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా, ఉద్యమకారుడిగా గుర్తింపు ఉన్న ఈటల రాజేందర్ విషయంలో తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టినట్లు ఫలితాల ద్వారా వ్యక్తమైందనే వ్యాఖ్యలూ ఆ పార్టీ నాయకుల నుంచి వ్యక్తమవుతున్నది.
ఈటల గెలుపు తర్వాత ఆయన భావజాలంతో ఏకీభవించే టీఆర్ఎస్ నాయకులు చేజారిపోతారేమో అనే అనుమానం పార్టీలోని చాలా మంది మధ్య గుసగుసల స్థాయిలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే బంగారు తెలంగాణ (బీటీ) బ్యాచ్, ఉద్యమకారుల తెలంగాణ (యూటీ) బ్యాచ్ అనే విభజన ఉన్నట్లు అప్పుడప్పుడూ కొద్ది మంది మాటల్లో ప్రతిబింబిస్తున్నది. హుజూరాబాద్ ఫలితం తర్వాత ఆ విభజన మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు చోటుచేసుకుంటున్నాయి. కేసీఆర్ వ్యక్తిగత వ్యవహార శైలి పట్ల అసంతృప్తి ఉన్నవారు ఇప్పుడు పార్టీని విడిచిపెట్టి ఈటలతో జతకట్టడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు కూడా కొద్దిమంది భావిస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం సమీప భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాలి.