- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌కు నేను లెఫ్ట్ అయితే హరీష్ రావు రైట్.. ఇప్పుడు ‘దయ్యాన్ని’ అంట..!
దిశ, జమ్మికుంట : హుజురాబాద్ ఉపఎన్నికల్లో భాగంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్ర శనివారం కూడా సాగింది. ప్రజాదీవెన యాత్ర పేరిట సాగిస్తున్న ఈ యాత్ర ఈరోజు ఇల్లందకుంట మండల కేంద్రంతో పాటు, శ్రీరాముల పల్లి, మల్యాల, లక్ష్మాజి పల్లి, వాగొడ్డు రామన్న పల్లి, కనగర్తి గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. తనకు కుడి, ఎడమ ఎవరూ ఉండకూడదని ప్రాణం ఉండగానే నన్ను బొంద పెట్టాలని కేసీఆర్ చూస్తున్నాడని ఈటల వ్యాఖ్యానించారు. ఆరోగ్య మంత్రిగా, ఆర్థిక మంత్రిగా నాకు మంచి పేరు వస్తోందని కుట్ర పన్ని, పథకం ప్రకారమే కొంతమంది వద్ద డబ్బులు తీసుకుని మంత్రివర్గం నుండి తొలగించాలన్నారు. అమెరికా వంటి దేశాలు కూడా ఆక్సిజన్ కొరతతో అల్లాడిందని, ఎందరో వైద్యులు, నర్సులు చనిపోయారని వైద్య మంత్రిగా నేను ముందు నడుస్తుంటే, ఫామ్ హౌస్‌లో కూర్చుని ఎక్కడ మంచి పేరు వస్తుందని భర్తరఫ్ నాటకం ఆడారని పేర్కొన్నారు. కేసీఆర్ అధికారాన్ని, డబ్బును దౌర్జన్యాలను ఎదుర్కొనే సత్తా తనకు లేదని, ఆ సత్తా ప్రజలకు మాత్రమే ఉందన్నారు.
ఉద్యమ సమయంలో నా సహచరుడు హరీష్ రావు, నేను ఇద్దరం కుడివైపు ఒకరం, ఎడమవైపు ఒకరం కేసీఆర్‌కు అండగా ఉన్నామని, అలాంటి రైట్ అండ్ లెఫ్ట్‌గా పనిచేసిన నేను ఇంతలోనే దయ్యం ఎట్లా అయ్యానో కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని సీఎంని అడిగితే మాదేమైనా మార్వాడి దుకాణామా..? రైసుమిల్లు వ్యాపారమా అని ఎద్దేవా చేశారని గుర్తుచేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసెంబ్లీలో మాట్లాడితే తలకాయ ఎక్కడ పెట్టుకుంటావ్ అని అడినపుడు.. నా తలకాయ తెలంగాణ తల్లి గర్భంలో చిరస్థాయిలో ఉంటానని చెప్పిన విషయాన్ని ప్రజలకు వివరించారు. భీ ఫామ్ ఇస్తే నో, నీ ఫోటో పెట్టుకుంటే నో ఎవరు గెలువరని, ప్రజల కాళ్లకు ముల్లు గుచ్చుకుంటే పంటితో తీసిన వాడికి ఓట్లు వేస్తారని అన్నారు. ఉప ఎన్నికల్లో మాత్రం పార్టీలు, రాజకీయాలు పక్కన పెట్టి తనను నిండు మనసుతో ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. కాగా, గ్రామగ్రామాన మహిళలు మంగళ హారతులు, యువకుల డప్పు చప్పుళ్ళతో ఈటలకు ఘనంగా స్వాగతం పలికారు. పాదయాత్రలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బొడిగె శోభ, ఎండల లక్ష్మీనారాయణ, ధర్మారావు, మండల పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి తిరుపతి రెడ్డిలు పాల్గొన్నారు.