- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జిల్లాల్లో న్యాక్ శిక్షణ కేంద్రాలు: మంత్రి వేముల
దిశ, తెలంగాణ బ్యూరో: నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్‌లో న్యాక్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని రాష్ట్ర ఆర్ అండ్‌బీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ప్రతి ఏడాది న్యాక్ ద్వారా 5 నుంచి 6 వేల మంది వివిధ నిర్మాణ రంగ సంస్థల్లో ఉపాధి పొందుతున్నారని, ఈ ఏడాది కొవిడ్ నేపథ్యంలో 2800 మందికి వివిధ సంస్థల్లో ఉపాధి కల్పించినట్లు తెలిపారు. హైటెక్స్‌లోని న్యాక్ క్యాంపస్‌లో బుధవారం జరిగిన న్యాక్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్‌కు మంత్రి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2021 సంవత్సరంలో వృత్తి నైపుణ్యంలో 21 వేల మంది నిరుద్యోగులకు శిక్షణ, 10 వేల మందికి ప్లేస్‌మెంట్ కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కొవిడ్ నేపథ్యంలో గల్ఫ్ నుంచి వచ్చిన వారికి ఇక్కడి నిర్మాణ రంగంలో ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే న్యాక్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ భిక్షపతి నేతృత్వంలో 10,500 మంది గల్ఫ్ నుంచి వచ్చిన వారిని కాంటాక్ట్ అయ్యామని తెలిపారు. వారికి నైపుణ్య శిక్షణతో పాటు సర్టిఫికెట్ ఇచ్చి వారి నైపుణ్యాల మేరకు వివిధ హోదాల్లో ఉపాధి కల్పిస్తున్నామన్నారు. న్యాక్ ఇచ్చే సర్టిఫికెట్‌తో గల్ఫ్‌కు ఉపాధి నిమిత్తం వెళ్ళే వారికి జీతం ఎక్కువ వస్తుందని చెప్పారు. శిక్షణ తీసుకున్న స్కిల్డ్, అన్ స్కిల్డ్ వారికి, నిర్మాణ రంగం సంస్థలకు ఉపాధి కల్పనలో న్యాక్ వారధిగా పని చేస్తుందని తెలిపారు.
సిమెంట్ ఫ్యాక్టరీలు, ఇతర పరిశ్రమలు ఉన్న కోదాడ, నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో న్యాక్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి యువతకు అక్కడే పలు విధాలా ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపట్టినట్లు మంత్రి వేముల వివరించారు. రూ.14 కోట్లతో న్యాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ చేయాలని, కొత్త నిర్మాణాల ప్రాక్టికల్ వర్క్‌షాప్, ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని న్యాక్ అధికారులను ఆదేశించారు. నైపుణ్య శిక్షణ ద్వారా ఇప్పటి వరకు ఉపాధి పొందిన వారి వివరాలు, శిక్షణ తరగతులపై మంత్రి న్యాక్ డీజీ భిక్షపతిని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణ రావు, న్యాక్ డీజీ భిక్షపతి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ బీఏఐ చైర్మన్ భాస్కర్ రెడ్డి, ఆర్ అండ్ బీ సీఈ సత్యనారాయణ, ఆడిట్ కమిటికీ చెందిన రామకృష్ణ రావు, శేఖర్ రెడ్డి, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.