తెలంగాణలో మరో కొత్త రెవెన్యూ డివిజన్

by Shyam |
తెలంగాణలో మరో కొత్త రెవెన్యూ డివిజన్
X

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణలో మరో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అయ్యింది. సంగారెడ్డి జిల్లాలో అందోల్- జోగిపేట రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. జోగిపేట కేంద్రంగా పని చేయనుంది. ఇందులో ఆందోల్, పుల్కల్, వట్‌పల్లి, చౌటకూరు మండలాలను చేర్చారు. అలాగే అదే డివిజన్‌లో కొత్తగా చౌటకూరు మండలాన్ని కూడా ఏర్పాటు చేశారు. మండలాల వారీగా గ్రామాలను నిర్ణయించారు.

మండలం- దాని పరిధిలోని గ్రామాలు

ఆందోల్: శేరిమల్లారెడ్డిపల్లి, కన్సాన్‌పల్లి, రాంసాన్‌పల్లి, కిచన్‌పల్లి, చింతకుంట, రోల్లపహడ్, మన్సాన్‌పల్లి, పోసానిపేట, అన్నాసాగర్, దానంపల్లి, ఎర్రారం, నేరడిగుంట, బ్రహ్మణపల్లి, అక్సాన్‌పల్లి, తాడమనూరు, కోడెకల్, నాడ్లపూర్, డోకూరు, మాసన్‌పల్లి, పోతిరెడ్డిపల్లి, కొండారెడ్డిపల్లి, సంగుపేట, ఆందోల్, సాయిబాన్‌పేట, అల్మాయిపేట, జోగిపేట

పుల్కల్: మంథూరు, రాయిపహడ్, పెద్దరెడ్డిపేట, శేరిపెద్దారెడ్డిపేట, సింగూరు, పోచారం, ముద్దాయిపేట, పుల్కల్, బస్వాపూర్, ముదిమాణిక్యం, సురెడ్డి ఐక్యల్, లక్ష్మీసాగర్, మిన్పూరు, కోడూరు, ఇసోజిపేట, గొంగులూరు

వట్‌పల్లి: పోతులబోగుడ, గొర్రెకల్, వట్‌పల్లి, షాహీద్‌నగర్, గౌటపూర్, పాల్వట్ల, నాగులపల్లి, బిద్దాయిపల్లి, బిజిలిపూర్, మార్వెల్లి, కేరూరు, మేడికుండ, దుదియాల్, పాలడుగు, దేవనూరు, బూత్కూరు, ఉస్రిక్పల్లి, నీర్జిప్లా, ఖాదిరాబాద్

చౌటకూరు: పోసానిపల్లి, చౌటుకూరు, శేరిరామరెడ్డిగూడ, సుల్తాన్‌పూర్, శరఫ్‌పల్లి, కోర్పోల్, లింగంపల్లి, వెంకటకిష్టాపూర్, తాడన్ పల్లి, గంగోజిపేట, చక్రియాల్, శివంపేట, వెండికోల్, హున్నాపూర్

Advertisement

Next Story

Most Viewed