- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీతాలు చెల్లించాలని ఈఎస్ఐ హాస్పిటల్ ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ధర్నా
దిశ, బేగంపేట : తమ జీతాలు చెల్లించాలని ఈఎస్‌ఐ ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ధర్నాకు దిగారు. కరోనా లాంటి కష్టకాలంలో లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ అనేక దూర ప్రాంతాల నుండి ఇబ్బందుల్ని ఓర్చుకుంటూ డ్యూటీలు చేస్తున్నారు. మూడు నెలలు కావొస్తున్నా ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి జీతాలు చెల్లించకుండా కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఇలాగే కొనసాగితే నిరవధిక సమ్మెకు సైతం వెళ్లక తప్పదని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.నర్సింహ ప్రభుత్వం డిమాండ్ చేశారు. నాచారంలోని ఈఎస్ఐ ఆస్పత్రి ముందు మంగళవారం రెండు గంటల పాటు ఔట్ సోర్సింగ్ సిబ్బంది ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా నరసింహ మాట్లాడుతూ వారం రోజుల క్రితం జీతాల కోసం మెమోరాండం ఇచ్చినప్పటికీ అధికారులు కానీ, కాంట్రాక్టర్లు కానీ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు.
చాలీ చాలని జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న కార్మికులు రెండు నెలలకు పైబడి జీతాలు లేక పోవడంతో అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారని, జీతాల చెల్లింపుపై తక్షణం అధికారులు స్పందించకపోతే సమ్మె నిర్వహిస్తామన్నారు. కార్మికులకు వెంటనే రెండు నెలల జీతాలు చెల్లించాలని, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కరోనా డ్యూటీలు చేస్తున్నందున క్వారంటైన్ లీవులు పదిహేను రోజులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి బ్రాంచ్ అధ్యక్షులు ధనరామ్, ప్రధాన కార్యదర్శి భాస్కరాచారి, నర్సింగ్ సిబ్బంది నాగమణి, మేరీ, కల్యాణి నరసింహ తదితరులు పాల్గొన్నారు..