- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వీడు మామూలోడు కాదు.. పోలీసులనే బురిడీ కొట్టించి, చివరకు చిక్కి..!
దిశప్రతినిధి, నిజామాబాద్ : విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించిన నిందితుడు పోలీసులు కళ్లుగప్పి తప్పించుకోగా అతన్ని ఎట్టకేలకు పట్టుకున్నారు. శనివారం నిందితుడిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండ్‌కు తరలించాలని తీర్పు వెలువడింది. ఈ ఘటన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సిద్దాపూర్ గ్రామంలో వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. సిరాజిరాజు అనే యువకుడు ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా ఎడపల్లి మండలంలోని ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలికను పరిచయం చేసుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా ఇద్దరు వివరాలు షేర్ చేసుకున్నారు. ఇద్దరి మధ్య పరిచయం కాస్తా ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకునే వరకు వెళ్లింది.
వాటిని అడ్డం పెట్టుకుని రాజు బాలికను పలుమార్లు వేధింపులకు గురిచేశాడు. చివరకు బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడటంతో బాలిక తల్లిదండ్రులకు తెలిపింది. వారు స్థానిక ఎడపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఎక్కడ అరెస్టు చేస్తారేమోనని రాజు కోర్టులో లొంగిపోయాడు. కోర్టులో లొంగిపోయిన రాజును కేసు విచారణ నిమిత్తం ఒక రోజు కస్టడికి ఇవ్వాలని పోలీసుశాఖ అభ్యర్థించింది. అతడిని ఈ నెల 18న స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. గురువారం తెల్లవారు జామున పోలీసు కస్టడిలో ఉన్న రాజు తప్పించుకుని పారిపోయాడు. దీంతో ఎడపల్లి పోలీసులు రాజుపై మరో కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. అతన్ని న్యాయస్థానం ఎదుట హాజరుపర్చగా రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి కస్టడిలో ఉన్న నిందితుడి పరారీకి కారణమైన పోలీసు సిబ్బంది, అధికారులపై వేటు వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు నివేదిక కోరినట్టు తెలిసింది. బోధన్ ఏసీపీ రామారావు నివేదిక ఆధారంగా ఎప్పుడైనా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.