- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజల భాగస్వామ్యం కీలకం : ఎర్రబెల్లి
దిశ, వరంగల్: తెలంగాణాలో పల్లె ప్రగతితో గ్రామాలు అద్భుతంగా తయారయ్యాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఖిల్లా వరంగల్‌లో నిర్వహించిన పట్టణ ప్రగతిలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో కలిసి ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పట్టణ ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం కీలకమైనదన్నారు. మన ఇంటి పరిసరాలను మనమే శుభ్రం చేసుకోవాలని, ఎవరో వచ్చి చేస్తారని అనుకోకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ… అధికారులు, నాయకులు వార్డుల్లో ఉన్న ఇబ్బందులను గుర్తించుకుని వాటికి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ అత్యంత ఇష్టమైన నగరం వరంగల్, పట్టణ ప్రగతిలో భాగంగా మన వార్డులను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. నిధుల కొరత లేకుండా రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు తక్షణ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గుండు సుధారాణి, కమిషనర్ పమేల సత్పతి, జాయింట్ కలెక్టర్ దయానంద్, తదితరులు పాల్గొన్నారు.