జానా రెడ్డి కామెంట్స్‌కు ఎర్రబెల్లి రిప్లై

by Shyam |
జానా రెడ్డి కామెంట్స్‌కు ఎర్రబెల్లి రిప్లై
X

దిశ,వెబ్ డెస్క్: ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జానారెడ్డి వాళ్లు ఊరికి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదంటున్నారనీ..కానీ జానారెడ్డి ఊరికే కాదు ఆయన ఇంటికి కూడా నీళ్లు వెళుతున్నాయని అన్నారు. జానారెడ్డి ఇంటికి నీళ్లు వస్తున్నాయని మిషన్ భగీరథ అధికారులు వివరించారని చెప్పారు. రాజకీయ లబ్ది కోసమే జానారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఆంధ్రా పార్టీలను స్వాగతించలేదని తెలిపారు. టీడీపీ విషయంలో కూడా అదే జరిగిందన్నారు. తెలంగాణలో చాలా పార్టీలు వచ్చాయనీ..కానీ సక్సెస్ కాలేదన్నారు.

Advertisement

Next Story